Balagam 12 Days Collections: 'బలగం'కు దక్కుతున్న ఆదరణ.. కోట్లలో లాభాలు.. ఇంకొన్ని లక్షలు వస్తే!
కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలకంటే కమర్షియల్ మూవీస్ బాగా హిట్ అయ్యేవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీస్ సైతం సత్తా చాటుతున్నాయి. అంతేకాకుండా కథ బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని ప్రేక్షకులు ఆలోచించకుండా సూపర్ హిట్ అందిస్తున్నారు. అలా తాజాగా చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా బలగం. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయాల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఈ క్రమంలో 12 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ రివ్యూస్..
కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం బలగం. కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతోంది. అంతేకాకుండా పాజిటివ్ రివ్యూస్ కూడా దక్కాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
తెలంగాణలోని పక్కా పల్లెటూరి కథతో తెరకెక్కిన చిత్రం 'బలగం'. ఈ సినిమా కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

12వ రోజు వసూళ్లు..
తెలంగాణ ఆచారాలు, సాంప్రదాయాలు వంటి సున్నితమైన అంశాలతో రూపొందిన 'బలగం' చిత్రానికి ప్రారభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో బలగం చిత్రానికి 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 88 లక్షల గ్రాస్ రాబట్టింది.

12 రోజుల్లో వచ్చింది..
జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా నిరూపించుకున్న వేణు ఎల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం బలగం. ఈ సినిమాపై కథపరంగా వివాదం నెలకొన్నప్పటికీ ప్రస్తుతం సద్దమణుగింది. దీంతో సినిమాపై అటెన్షన్ క్రియేట్ అయింది. ఇక బలగం సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఈ క్రమంలో బలగం మూవీకి 12 రోజుల్లో నైజాంలో రూ. 8.07 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 4.99 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రూ. 13.06 కోట్ల గ్రాస్, రూ. 5.96 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..
వేణు ఎల్దండి దర్శకత్వం వహించి సత్తా చాటుతున్న సినిమా బలగం. ఈ సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.42 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ప్రపంచ వ్యాప్తంగానూ రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 12 రోజుల్లో రూ. 28లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 6.10 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

ప్రాఫిట్ ఎంతంటే..
తెలంగాణలోని పల్లెటూరి కుటుంబాలు, కట్టుబాట్లు, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందిన 'బలగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 12 రోజుల్లో రూ. 6.10 కోట్లు వచ్చాయి. అంటే.. మంచి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.80 లాభాలు కూడా ఈ సినిమాకు సొంతం అయ్యాయి. అంటే ఇంకొక రూ. 20 లక్షలు వస్తే రూ. 5 కోట్ల లాభం అందుకోనుంది ఈ సినిమా.


Click it and Unblock the Notifications











