Balagam 13 Days Collections: మళ్లీ బలగం ఊచకోత.. వర్కింగ్ డేలో కూడా సత్తా.. 15 కోట్ల మార్క్!

జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). మలేషం సినిమాతో ఆకట్టుకున్న కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మంచి వసూళ్లు సాధిస్తోంది బలగం మూవీ. ఈ నేపథ్యంలో బలగం సినిమాకు 13వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

 డైరెక్టర్ గా మారిన కమెడియన్..

డైరెక్టర్ గా మారిన కమెడియన్..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టన్నింగ్ బ్యూటి ఇలియానా జోడిగా నటించిన మున్నా సినిమాలో టిల్లు వేణుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఎల్దండి. ఆ తర్వాత పలు చిత్రాలతో ఆకట్టుకున్న వేణు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా చాలా పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా తర్వాత టీం లీడర్ గా చేసిన వేణు ఎల్దండి దర్శకుడిని చేసిన చిత్రం బలగం.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

కమెడియన్ ప్రియదర్శి, బాలనటిగా పేరు తెచ్చుకుని మసూద సినిమాతో హీరోయిన్ గా మారిన కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి వంటి తదితరులు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం బలగం. టిల్లు వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు మొత్తంగా రూ. 1.15 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

13వ రోజు ఎంతంటే..

13వ రోజు ఎంతంటే..


హాస్య నటుడుగా మంచి పేరు సంపాదించున్న వేణు ఎల్దండి ఎన్నో చిత్రాల్లో అడపాదడపా నటిస్తు వస్తున్నాడు. తాజాగా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని కొత్త కెరీర్ ప్రారంభించాడు. ఈ పయనంలో తొలి అడుగు విజయవంతంగా పడిందనే చెప్పవచ్చు. ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తోంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగున్నాయి. బలగం చిత్రానికి 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 91 లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది ఈ సినిమా.

13 రోజుల్లో వచ్చింది..

13 రోజుల్లో వచ్చింది..


బలగం చిత్రాన్ని పూర్తిగా ఒకే ఊరిలో పది రోజుల వ్యవధిలో చిత్రీకరించి చాలా రిచ్ లుక్ వచ్చేలా నిర్మించారు. చిన్న బడ్జెట్ లో ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించారని టాక్ వస్తోంది. బలగం చిత్రం విజువల్ పరంగా కూడా ఆకట్టుకుందని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. బలగం చిత్రానికి 13 రోజుల్లో నైజాంలో రూ. 8.79 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 5.18 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో రూ. 13.97 కోట్ల గ్రాస్, రూ. 6.38 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

మల్లేషం సినిమాలో ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్న ప్రియదర్శి, ముద్దుగుమ్మ కావ్య కల్యాణ్ రామ్ తొలిసారి జంటగా నటించిన బలగం చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రానికి 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.97 కోట్ల గ్రాస్ రాగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలిపి రూ. 31 లక్షలు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బలగం చిత్రానికి 13 రోజుల్లో రూ. 14.28కోట్లు గ్రాస్, రూ. 6.53 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. అంటే బలగం సినిమా సుమారు రూ. 15 కోట్ల మార్క్ కు చేరువగా ఉందని తెలుస్తోంది.

ప్రాఫిట్ ఎంతంటే..

ప్రాఫిట్ ఎంతంటే..


ఫ్యామిలీ ఎమోషన్స్, పిట్టకు పెట్టుడు వంటి కాన్సెప్ట్ తో వచ్చిన బలగం చిత్రానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మూవీకి రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమా 13 రోజుల్లో రూ. 6.53 కోట్లు రాబట్టగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని రూ. 5.23 లక్షలు ప్రాఫిట్ సొంతం చేసుకుంది. ఇలా డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమాతో డైరెక్టర్ వేణు మంచి హిట్ కొట్టగా దిల్ రాజుకు మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X