Balagam 3 Days Collections: దర్శకుడిగా వేణు రికార్డ్.. బ్రేక్ ఈవెన్ పూర్తి.. లాభాలు ఎంతంటే?

జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది.

మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మంచి కలెక్షన్స్ రాబడుతోంది బలగం సినిమా. ఈ నేపథ్యంలో బలగం మూవీకి 3వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

కమెడియన్ నుంచి..

కమెడియన్ నుంచి..

హీరో నవదీప్ నటించిన జై సినిమాతో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు ఎల్దండి వేణు. ఆ తర్వాత ప్రభాస్ మున్నా సినిమాతో టిల్లు వేణుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు చిత్రాలతో ఆకట్టుకున్న వేణు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా చాలా పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా తర్వాత టీం లీడర్ గా చేసిన వేణు ఎల్దండి దర్శకుడిని చేసిన చిత్రం బలగం.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి వంటి తదితరులు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం బలగం. టిల్లు వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు మొత్తంగా రూ. 1.15 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నమోదు అయింది.

3వ రోజు ఎంతంటే..

3వ రోజు ఎంతంటే..

కమెడియన్ గా మంచి పేరు సంపాదించున్న వేణు ఎల్దండి ఎన్నో చిత్రాల్లో అడపాదడపా నటిస్తు వస్తున్నాడు. తాజాగా దర్శకుడిగా పయనం మొదలు పెట్టాడు. ఈ పయనంలో తొలి అడుగు విజయవంతంగా పడిందనే చెప్పవచ్చు. ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తోంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగున్నాయి. బలగం చిత్రానికి 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 1.75 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

3 రోజుల్లో వచ్చింది..

3 రోజుల్లో వచ్చింది..

బలగం చిత్రాన్ని పూర్తిగా ఒకే ఊరిలో పది రోజుల వ్యవధిలో చిత్రీకరించిన చాలా రిచ్ లుక్ వచ్చేలా నిర్మించారు. చిన్న బడ్జెట్ లో ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించారని టాక్ వస్తోంది. బలగం చిత్రానికి విజువల్స్ అన్ని రిచ్ లుక్ లో ఉన్నాయి. ఇక సినిమా మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. బలగం చిత్రానికి మూడు రోజుల్లో నైజాంలో రూ. 2.05 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 1.05 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రూ. 3.10 కోట్ల గ్రాస్, రూ. 1.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ తొలిసారి జంటగా నటించిన బలగం చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రానికి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు రాగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలిపి రూ. 5 లక్షలు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బలగం చిత్రానికి మూడు రోజుల్లో రూ. 3.15 కోట్లు గ్రాస్, రూ. 1.32 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

ప్రాఫిట్ ఎంతంటే..

ప్రాఫిట్ ఎంతంటే..

ఫ్యామిలీ ఎమోషన్స్, పిట్టకు పెట్టుడు వంటి కాన్సెప్ట్ తో వచ్చిన బలగం చిత్రానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మూవీకి రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 1.32 కోట్లు రాబట్టగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని రూ. 2 లక్షలు ప్రాఫిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే హిట్ తెచ్చుకుని డైరెక్టర్ గా వేణు రికార్డ్ క్రియేట్ చేసినట్లయింది. ఇక దిల్ రాజుకు ప్రస్తుతం రూ. 2 లక్షల లాభం చేకూరుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X