Balagam 14 Days Collections: డైరెక్టర్ గా వేణు సంచలన విజయం.. ఆ మార్క్ దాటి బలగం వసూళ్ల రికార్డ్!

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. గతేడాది విడుదలైన కాంతారా, కార్తికేయ 2 సినిమాలు దేశవ్యాప్తంగా సత్తా చాటాయి. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన చిన్న చిత్రాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయని ఈ సంవత్సరం బలగం మూవీ నిరూపించింది. అయితే ప్రేక్షకుల ఆలోచన శైలీ, అభిరుచి మారింది. అందుకే కథ బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని ప్రేక్షకులు ఆలోచించకుండా సూపర్ హిట్ అందిస్తున్నారు. అలా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న బలగం సినిమాకు వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలగం మూవీకి 14వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై..

బుల్లితెరపై..


కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు ముఖ్య భూమిక పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతోంది. అంతేకాకుండా పాజిటివ్ రివ్యూస్ కూడా దక్కాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

తెలంగాణలోని పక్కా పల్లెటూరి కథతో తెరకెక్కిన మూవీ 'బలగం'. ఈ సినిమా కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

14వ రోజు వసూళ్లు..

14వ రోజు వసూళ్లు..


తెలంగాణ ఆచారాలు, సాంప్రదాయాలు వంటి సున్నితమైన అంశాలతో రూపొందిన 'బలగం' చిత్రానికి ప్రారభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో బలగం చిత్రానికి 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 90 లక్షల గ్రాస్ రాబట్టింది.

14 రోజుల్లో వచ్చింది..

14 రోజుల్లో వచ్చింది..

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా నిరూపించుకున్న వేణు ఎల్దండి మొట్ట మొదటి సారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం బలగం. ఈ సినిమాపై కథపరంగా వివాదం నెలకొన్నప్పటికీ ప్రస్తుతం సద్దమణుగింది. దీంతో సినిమాపై అటెన్షన్ క్రియేట్ అయింది. ఇక బలగం సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఈ క్రమంలో బలగం మూవీకి 14 రోజుల్లో నైజాంలో రూ. 9.46 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 5.41 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో రూ. 14.87 కోట్ల గ్రాస్, రూ. 6.78 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

వేణు ఎల్దండి దర్శకత్వం వహించి సత్తా చాటుతున్న సినిమా బలగం. ఈ సినిమా 14 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.87 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణిస్తోందని చెప్పొచ్చు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 14 రోజుల్లో రూ. 33లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటన్నింటిని కలుపుకుంటే బలగం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 6.94 కోట్లు షేర్ కలెక్ట్ అయింది. బలగం సినిమా మొదట్లో 15 రోజుల్లో క్లోజింగ్ కలెక్షన్స్ పూర్తి చేసుకుంటుందనుకుంటే 14 రోజుల్లో రూ. 15 కోట్ల మార్క్ గ్రాస్ దాటి సత్తా చాటి రికార్డ్ క్రియేట్ చేసింది.

 సినిమాకు లాభాలు..

సినిమాకు లాభాలు..

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని కుటుంబాలు, కట్టుబాట్లు, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందిన 'బలగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 14 రోజుల్లో రూ. 6.94 కోట్లు వచ్చాయి. అంటే.. మంచి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.64 లాభాలు కూడా ఈ సినిమాకు సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X