Balagam 18 Days Collections: బలగంకు అదిరిపోయే కలెక్షన్స్.. వేణు ప్రతిభకు కోట్లల్లో లాభాలు!

జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). మలేషం సినిమాతో ఆకట్టుకున్న కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మంచి వసూళ్లు సాధిస్తోంది బలగం మూవీ. ఈ నేపథ్యంలో బలగం సినిమాకు 18వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

విమర్శకుల ప్రశంసలు..

విమర్శకుల ప్రశంసలు..


కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు ముఖ్య భూమిక పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా పాజిటివ్ రివ్యూస్ కూడా దక్కాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో తెరకెక్కిన మూవీ 'బలగం'. ఈ సినిమా కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

18వ రోజు వసూళ్లు..

18వ రోజు వసూళ్లు..

తెలంగాణ రాష్ట్రంలోని ఆచారాలు, సాంప్రదాయాలు వంటి సున్నితమైన అంశాలతో రూపొందిన 'బలగం' చిత్రానికి ప్రారభం నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో బలగం చిత్రానికి 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 77 లక్షల గ్రాస్ రాబట్టింది. అంటే వర్కింగ్ డే రోజు కూడా మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

18 రోజుల్లో వచ్చింది..

18 రోజుల్లో వచ్చింది..

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా నిరూపించుకున్న వేణు ఎల్దండి మొట్ట మొదటి సారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం బలగం. ఈ సినిమాపై కథపరంగా వివాదం నెలకొన్నప్పటికీ ప్రస్తుతం సద్దమణుగింది. దీంతో సినిమాపై అటెన్షన్ క్రియేట్ అయింది. ఇక బలగం సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఈ క్రమంలో బలగం మూవీకి 18 రోజుల్లో నైజాంలో రూ. 12.38 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 6.47 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో రూ. 18.85 కోట్ల గ్రాస్, రూ. 8.58 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించి సత్తా చాటుతున్న సినిమా బలగం. ఈ సినిమా 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.85 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణిస్తోందని చెప్పొచ్చు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 18 రోజుల్లో రూ. 41 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటన్నింటిని కలుపుకుంటే బలగం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.26 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 8.75 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

 సినిమాకు లాభాలు..

సినిమాకు లాభాలు..


తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని కుటుంబాలు, కట్టుబాట్లు, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందిన 'బలగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 18 రోజుల్లో రూ. 8.75 కోట్లు కొల్లగొట్టి.. రూ. 7.45 లాభాలు సొంతం అయ్యాయి. అంటే ఈ సినిమా క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X