Balagam 25 Days Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని కలెక్షన్స్.. దిల్ రాజుకు ఏకంగా అన్ని కోట్ల లాభాలు!
జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). మలేషం సినిమాతో ఆకట్టుకున్న కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది.
మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు ఇటీవలే అంటే మార్చి 17న ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినా కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో బలగం సినిమాకు 25వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

తొలి రోజు నుంచి..
కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు ముఖ్య భూమిక పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైన కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గట్లేదు.

ప్రీ రిలీజ్ బిజినెస్..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో తెరకెక్కిన మూవీ 'బలగం'. ఈ సినిమా కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

25వ రోజు వసూళ్లు..
'బలగం' చిత్రానికి ప్రారభం నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో బలగం చిత్రానికి 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 44 లక్షల గ్రాస్ రాబట్టింది.

25 రోజుల్లో వచ్చింది..
బలగం సినిమాపై మొదట్లో కథపరంగా వివాదం నెలకొన్నప్పటికీ ప్రస్తుతం సద్దమణుగింది. ఇక బలగం సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఈ క్రమంలో బలగం మూవీకి 25 రోజుల్లో నైజాంలో రూ. 16.75 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 7.54 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో రూ. 24.29 కోట్ల గ్రాస్, రూ. 11.14 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..
కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించి సత్తా చాటుతున్న బలగం సినిమాకు 25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.29 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణిస్తోందని చెప్పొచ్చు. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 25 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటన్నింటిని కలుపుకుంటే బలగం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.71 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.22 కోట్లు షేర్ కలెక్ట్ అయింది.

సినిమాకు లాభాలు..
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని కుటుంబాలు, కట్టుబాట్లు, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందిన 'బలగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 25 రోజుల్లో రూ. 11.22 కోట్లు కొల్లగొట్టి.. రూ. 10.03 లాభాలు సొంతం అయ్యాయి. అంటే ఈ సినిమా హిట్ స్టేటస్ తోపాటు రూ. 10 కోట్లకుపైగా లాభాలు గడించింది.


Click it and Unblock the Notifications











