Balagam 28 Days Collections: బలగంకు లేని దసరా ఎఫెక్ట్.. ధమ్కీకి మించి వసూళ్లు.. ఆ రికార్డుతో సత్తా!

జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). మలేషం సినిమాతో ఆకట్టుకున్న కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో బలగం సినిమాకు నాలుగు వారాల అంటే 28 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో విడుదలై కూడా..

ఓటీటీలో విడుదలై కూడా..

కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు ముఖ్య భూమిక పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మార్చి 17న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై కూడా అలరిస్తోంది.

 ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో తెరకెక్కిన మూవీ 'బలగం'. ఈ సినిమా కాన్సెప్టు గురించి ముందే తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.15 కోట్లు బిజినెస్ జరిగింది. ఫలితంగా రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఖరారు అయింది.

28వ రోజు వసూళ్లు..

28వ రోజు వసూళ్లు..

'బలగం' ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. అందుకే వేణు దర్శకత్వం వహించిన ఈ మూవీకి 28వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 31 లక్షల గ్రాస్ రాబట్టింది. నాని దసరా మూవీ విడుదలైన శుక్రవారం రోజున విశ్వక్ సేన్ ధమ్కీ కంటే ఎక్కువగానే వసూలు చేసింది.

28 రోజుల కలెక్షన్స్..

28 రోజుల కలెక్షన్స్..


జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా నిరూపించుకున్న వేణు ఎల్దండి మొట్ట మొదటి సారిగా మెగా ఫోన్ పట్టిన బలగం సినిమాను ఇప్పటికీ థియేటర్లలోకి వెళ్లి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి 28 రోజుల్లో నైజాంలో రూ. 17.70 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 7.89 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో రూ. 25.59 కోట్ల గ్రాస్, రూ. 11.77 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

దిల్ రాజు ప్రొడక్షన్ సినిమా బలగంకు 28 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.59 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి 28 రోజుల్లో రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయినట్లు సమాచారం. ఇవన్నీ కలుపుకుంటే బలగం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.01 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.77 కోట్లు షేర్ కలెక్ట్ అయింది. ఈ సినిమాకు నాని దసరా మూవీ ఎఫెక్ట్ పెద్దగా పడనట్లు తెలుస్తోంది.

 ప్రాఫిట్ అంతా.. ఆ రికార్డ్..

ప్రాఫిట్ అంతా.. ఆ రికార్డ్..

'బలగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.30 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 28 రోజుల్లో అంటే 4 వారాల్లో రూ. 11.77 కోట్లు కొల్లగొట్టి.. రూ. 10.67 ప్రాఫిట్ సొంతం చేసుకుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా.. ఓటీటీలో రన్ అవుతూ కూడా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తున్న సినిమాగా రికార్డుకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X