twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క సినిమా ఆడితే ఒట్టు... అయ్యో ఈ వారం ఇలా అయిందేంటి?

    ఈ వారం తెలుగు బాక్సాఫీకు వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఐదు సినిమాలు విడుదలైనా ఒక్కటి కూడా హిట్ టాక్ రాలేదు.

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా రంగానికి గడిచిన శుక్రవారం... చీకటి వారంగా మిగిలిపోతుందేమో. ఈ వారం ఏకంగా 5 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. సెలవు దినాలైన అయిన శని, ఆదివారాల్లో కూడా థియేటర్లలో చాలా వరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

    ఈ వారం సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు', బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా తీసిన 'శ్రీవల్లి', సచిన్ జోషి నటించిన 'వీడెవడు', శింబు తమిళ డబ్బింగ్ మూవీ 'సరసుడు', నారా రోహిత్ నటించిన 'కథలో రాజకుమారి' సినిమాలు విడుదలయ్యాయి.

    ఉంగరాల రాంబాబు రిజల్ట్

    ఉంగరాల రాంబాబు రిజల్ట్

    సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలైంది. సినిమా రోటీన్ గా ఉండటంతో ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు.

    వీడెవడు

    వీడెవడు

    స‌చిన్‌, ఇషా గుప్తా హీరో హీరోయిన్లుగా వై కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రైనా జోషి నిర్మించిన చిత్రం `వీడెవ‌డు`. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైంది. సినిమాకు ఓ మోస్తర్ టాక్ వచ్చినప్పటికీ.... సచిన్ జోషికి అంతగా ఫాలోయింగ్ లేక పోవడంతో థియేటర్లలో చాలా వరకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.

    శ్రీవల్లి

    శ్రీవల్లి

    బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్‌ఓవర్ చెప్పినా.... బాక్సాఫీసు వద్ద నిలబడలేక పోయింది. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ వచ్చినప్పటికీ అది ఎందుకో ప్రేక్షకులకు ఎక్కినట్లు లేదు.

    కథలో రాజకుమారి

    కథలో రాజకుమారి

    నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రధారులుగా మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో రాజేష్‌ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం 'కథలో రాజకుమారి'. ఈ చిత్రం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. థియేటర్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

    సరసుడు

    సరసుడు

    శింబు సినీ ఆర్ట్స్, జెసన్ రాజ్ ఫిలిమ్స్ పతా కాలపై టి.రాజేందర్ నిర్మించిన‌ చిత్రం `సరసుడు`. పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. శింబు, నయనతార జంటగా నటించారు. చాలా కాలం క్రితమే తమిళంలో విడుదలైన ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

    English summary
    The last week at the Tollywood box office is worst for the producers and the audiences are feeling sad that not even a single film has impressed them. Almost five films released that weekend and every film ended up as a flop one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X