ఈ వారం 'సునామీ సెవెన్ ఎక్స్' అనే సినిమా ఒక్కటే రిలీజయింది. అంకిత ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక అంతకుముందు వారం రిలీజైన ద్రోణ, సిక్సీన్ డేస్, వెంకటాద్రి, మొండి మొగుడు పెంకి పెళ్ళాలు, సోల్జర్ చిత్రాలు పూర్తి స్ధాయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో అరుంధతి చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకున్నా టాప్ ప్లేస్ లో ఉంది. అలాగే ఈ వారం శివాజి, కావేరీ ఝా నటించిన నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అనే చిత్రం మాత్రమే రిలీజవుతోంది. ఇక కొన్ని ధియోటర్లలో వేసుకోవటానికి ఏ సినిమాలు లేకపోవటంతో కొన్ని చోట్లా మస్కా, రెడీ, ఔట్ ల్యాండర్ (తెలుగు డబ్బింగ్) చిత్రాలు వేస్తున్నారు. అంతేగాక కొత్త సినిమాలు కూడా ఏవీ ప్రారంభం కావటం లేదు. ఆర్ధిక సంక్షోభం, రియల్ ఎస్టేట్ పడిపోవటం అని రకరకాలు కారణాలు చెప్తున్నా వరస ఫ్లాఫులు చూసి భయపెడుతున్న కొత్త నిర్మాతలు ముందుకు రావటం లేదన్నది సుస్పష్టం.