Disclosure Day Box Office: డిస్‌క్లోజర్ డే మూవీకి 1550 కోట్ల కలెక్షన్లు.. స్పీల్ బర్గ్ సినిమా నష్టాల్లోనే..

ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ డిస్‌క్లోజర్ డే. ఈ చిత్రానికి కథను అందించి స్వయంగా నిర్మించడం తెలిసిందే. ఈ సినిమాలో ఎమిలీ బ్లంట్, జోష్ ఓకానర్, కోలిన్ ఫిర్త్, ఈవ్ హెవ్సన్, కోల్మన్ డామింగో తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాకోస్కో క్రీజర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జాన్సుజ్ కామినిస్కీ సినిమాటోగ్రఫి, సారా బ్రోషర్ ఎడిటింగ్, జాన్ వీలియమ్స్ మ్యూజిక్ అందించాు. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారాఈ మూవీ జూన్ 12వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి సుమారుగా 115 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దాదాపు 80 మిలియన్ డాలర్లు ప్రమోషన్స్ కోసం ఉపయోగించారు. మొత్తంగా ఈ సినిమాను 195 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1847 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 300 మిలియన్ డాలర్లు అంటే 2850 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Disclosure Day Box Office

స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 79 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఇతర దేశాల్లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మరో 82 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. యూకేలో 5.5 మిలియన్ డాలర్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇండియాలో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో మెరుగైన వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి రోజున 1.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతంలో సుమారుగా 6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే తొలివారాంతం తర్వాత ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దాంతో ఈ సినిమా 9.5 కోట్ల గ్రాస్, 8.25 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

స్పీల్ బర్గ్ చిత్రమంటే వరల్డ్ వైడ్‌గా ఓ క్రేజ్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఆ వైబ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఇప్టపి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 161 మిలియన్ డాలర్లు అంటే.. 1550 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఇంకా 140 మిలియన్ డాలర్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృస్టిపెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X