twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదటివారంలో డిస్కోరాజా పర్‌ఫార్‌మెన్స్.. 7 రోజుల్లో ఎంత రాబట్టిందంటే

    |

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 24న విడుదలై మొదటివారం పూర్తిచేసుకుంది. మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీకి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. మరి ఈ 7 రోజుల్లో డిస్కో రాజా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..

    వీఐ ఆనంద్ టేకింగ్, రవితేజ నటన

    వీఐ ఆనంద్ టేకింగ్, రవితేజ నటన

    సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో వీఐ ఆనంద్ టేకింగ్, రవితేజ నటన ఆకట్టుందనే టాక్ వచ్చింది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ 7 రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్‌ రన్ కొనసాగించాడు డిస్కో రాజా.

    7 రోజుల్లో డిస్కో రాజా వసూళ్లు

    7 రోజుల్లో డిస్కో రాజా వసూళ్లు

    మొదటి 7 రోజుల్లో డిస్కో రాజా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు రాబట్టినట్లు రిపోర్ట్స్ అందాయి. మొదటి 6 రోజుల్లో 23 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా 7వ రోజు మరో 3 కోట్లు వసూలు చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో మొదటివారం వసూళ్లు 26 కోట్లుగా నమోదయ్యాయి.

    అంచనాలను అందుకోలేకపోయిన డిస్కోరాజా

    అంచనాలను అందుకోలేకపోయిన డిస్కోరాజా

    తెలుగు సినీ పరిశ్రమలో రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలున్నాయి. పైగా డిస్కోరాజా మూవీ ఆయన కెరీర్‌లో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకోలేక పోతోంది డిస్కోరాజా మూవీ.

    Recommended Video

    Ravi Teja Silent In Disco Raja Movie Success Press Meet
    ముగ్గురు భామలతో మాస్ మహారాజ్

    ముగ్గురు భామలతో మాస్ మహారాజ్

    ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందిన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహ కీలక పాత్ర పోషించాడు. చిత్రంలో రవితేజ నటనతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్స్ నటన ఫర్వాలేదని అంటున్నారు జనం.

    English summary
    Mass Maha Raja Raviteja Disco Raja Day 7 Box Office Collections are fine. This movie collected world wide shere as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X