డిస్కోరాజా 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్: ప్రపంచవ్యాప్తంగా మాస్ మహారాజ్ వసూళ్లు.. సేఫ్ కావాలంటే..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. ఇక డిస్కోరాజా సేఫ్ జోన్ లోకి రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులపాటు డీసెంట్ రన్ కొనసాగించక తప్పదు. మరి ఈ మూడు రోజుల్లో డిస్కోరాజా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

ప్రపంచవ్యాప్తంగా డిస్కో రాజా వసూళ్లు
తొలి షోతోనే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్‌గా ప్రదర్శించబడింది. ఈ మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.88 కోట్లు రాబట్టాడు రవితేజ. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6.86 కోట్లు వసూలు చేశాడు ఈ డిస్కో రాజా.

3వ రోజు వసూళ్లు.. డీటెయిల్ రిపోర్ట్
నైజాం - 77 లక్షలు
సీడెడ్ - 24 లక్షలు
గుంటూరు - 12 లక్షలు
ఉత్తరాంధ్ర - 25 లక్షలు
తూర్పు గోదావరి - 10 లక్షలు
పశ్చిమ గోదావరి - 9 లక్షలు
కృష్ణా - 10 లక్షలు
నెల్లూరు - 6 లక్షలు
మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3వ రోజు 1.73 వచ్చాయి.

మొత్తం మూడు రోజుల్లో డిస్కోరాజా కలెక్షన్స్
నైజాం - 2.52 కోట్లు
సీడెడ్ - 81 లక్షలు
గుంటూరు - 40 లక్షలు
ఉత్తరాంధ్ర - 76 లక్షలు
తూర్పు గోదావరి - 42 లక్షలు
పశ్చిమ గోదావరి - 34 లక్షలు
కృష్ణా - 40 లక్షలు
నెల్లూరు - 23 లక్షలు
మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల్లో 5.88 కోట్లు వచ్చేశాయి. అదే ప్రపంచవ్యాప్తంగా 6.86 కోట్లు వచ్చాయి.

డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు
ఇక డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, ఏయే ఏరియాల్లో ఎంతెంతకు అమ్ముడయ్యిందో చూస్తే
నైజాం - 5.7 కోట్లు
సీడెడ్ - 2.75 కోట్లు
గుంటూరు - 1.5 కోట్లు
ఉత్తరాంధ్ర - 1.95 కోట్లు
తూర్పు గోదావరి - 1.25 కోట్లు
పశ్చిమ గోదావరి - 1.05 కోట్లు
కృష్ణా - 1.25 కోట్లు
నెల్లూరు - 0.65 కోట్లు..
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.10 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 19.20 కోట్లు.

ఇంకా ఎంతరాబట్టాలంటే
అంటే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇంకా దాదాపు 13 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాలి. ఈ మేర వసూళ్లు రావాలంటే ఇంకో 10 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శించబడాలి. సో అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.
Recommended Video

డిస్కోరాజాతో ముగ్గురు భామలు
డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో రవితేజ నటనతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్స్ నటన ఫర్వాలేదని అంటున్నారు జనం.


Click it and Unblock the Notifications











