twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజకు మరోసారి నిరాశే.. ఓవరాల్’గా డిస్కోరాజా ఎంత నష్టమంటే?

    |

    మాస్ మహారాజా రవితేజ్ నటించిన డిస్కో రాజా చిత్రం జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో ముందుకొచ్చింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ రిపోర్ట్ రావడంతో వసూళ్లు భారీగానే నమోదయ్యాయి. అయితే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీపై సినీ విమర్శకులు ప్రతికూల రివ్యూలతో స్పందించడంతో వసూళ్లపై కొంత దెబ్బ పడింది. ఆ తర్వాత తికమకపెట్టే స్క్రిన్ ప్లే, కొత్తదనం ఏమి లేకపోవడంతో ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఈ చిత్రం రవితేజకు ఓ చేదు అనుభవాన్నే మిగిల్చిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. డిస్కో రాజా క్లోజింగ్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    డిస్కోరాజా సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండటంతో ఘనంగానే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
    నైజాం హక్కులు రూ.5.7 కోట్లు,
    సీడెడ్ హక్కులు రూ.2.75 కోట్లు,
    ఉత్తరాంధ్ర రూ.1.95 కోట్లు,
    తూర్పు రూ.1.25 కోట్లు,
    పశ్చిమ గోదావరి జిల్లా రూ.1.05 కోట్లు,
    గుంటూరు హక్కులు రూ.1.5 కోట్లు,
    కృష్ణా జిల్లా రూ.1.25 కోట్లు,
    నెల్లూరు జిల్లా హక్కులు రూ.65 కోట్లతో ఏపీ తెలంగాణలో రూ.16.10 కోట్ల బిజినెస్ జరిగింది.
    కర్ణాటకలో రూ.1.1 కోట్లు
    మిగితా రాష్ట్రాల హక్కులు రూ.50 లక్షలు
    ఓవర్సీస్ హక్కులు రూ.1.50 కోట్లు అమ్ముడు పోవడంతో ఓవరాల్‌గా రూ.19.20 కోట్ల బిజినెస్ జరిగింది.

    37 శాతం నష్టాలతోనే

    37 శాతం నష్టాలతోనే

    డిస్కో రాజా చిత్రానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు రూ.19.2 కోట్లకు అమ్ముడుపోవడంతో భారీగానే వసూళ్లు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తొలి వారాంతం వరకు కలెక్షన్లను బాగా రాబట్టడంతో సినిమా లాభాల్లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ సినిమాలకు లిట్మస్ టెస్ట్ లాంటి సోమవారం నుంచి నిలకడగా వసూళ్లు సాధించకపోవడంతో చివరకు రూ.37 శాతం నష్టాలతో క్లోజింగ్ కలెక్షన్లు నమోదైనట్టు సమాచారం. దాంతో ఈ సినిమా డిజాస్టర్ అనే టాక్‌ను సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో


    ఇక తెలుగు రాష్ట్రాల్లో క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. డిస్కో రాజా చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తంగా రూ.11.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక నికరంగా చూస్తే ఈ రెండు రాష్ట్రాల్లో రూ.6.46 కోట్లు సాధించింది. దాంతో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను బేరిజు వేసుకొంటే డిస్కో రోజా భారీ నష్టాల్లోనే ముగిసిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా

    ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్‌గా డిస్కో రాజా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

    నైజాంలో రూ.2.8 కోట్లు
    సీడెడ్‌లో రూ.9 లక్షలు
    ఉత్తరాంధ్రలో రూ.85 లక్షలు
    ఈస్ట్ గోదావరిలో రూ.55 లక్షలు
    వెస్ట్ గోదావరిలో రూ.39 లక్షలు
    గుంటూరులో రూ.40 లక్షలు
    కృష్ణా జిల్లాలో రూ.42 లక్షలు
    నెల్లూరులో రూ.15 లక్షల వసూళ్లను సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు


    ఇక డిస్కో రాజా సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.13.85 కోట్ల గ్రాస్ రూ.7.46 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. దీంతో సుమారు రూ.5 కోట్ల మేరకు లోటు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద తన కలెక్షన్ల ప్రయాణాన్ని డిస్కోరాజా మూవీ ముగించింది.

    English summary
    Disco Raja world wide box office closing collections: Disco Raja Pre release business was Rs.19.20 crores. Overal collections of this movie registered is Rs.13.85 crores only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X