twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలెక్షన్ రిపోర్ట్: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ది లయన్ కింగ్’

    |

    డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేషన్ మూవీ 'ది లయన్ కింగ్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండురోజుల్లో ఈ చిత్రం రూ. 30 కోట్లు రాబట్టింది. ఈ 3డి యానిమేటెడ్ మూీకి జోన్ ఫావ్‌రో దర్శకత్వం వహించారు. 1994లో వచ్చిన 2డి యానిమేషన్ మూవీని అదే పేరుతో రీమేక్ చేశారు.

    ఈ సినిమా గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ది లయన్ కింగ్ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది, పిల్లలు, ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు, రెండో రోజైన శనివారం అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డుల దర్శనమిచ్చాయని తెలిపారు.

    ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్లు ఖాయం

    ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్లు ఖాయం

    తొలి రోజైన శుక్రవారం ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి రూ. 11.06 కోట్లు, శనివారం రూ. 19.15 కోట్లు రాబట్టినట్లు తరణ్ ఆదర్శ్ తెలిపారు. దీంతో రెండు రోజుల్లో టోటల్ వసూళ్లు రూ. 30.21 కోట్లకు చేరుకుంది. ఆదివారం రూ. 20 కోట్లపైనే వసూలవుతుందని, దీంతో ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు.

    ఇండియాలో గ్రాండ్ రిలీజ్

    ఇండియాలో గ్రాండ్ రిలీజ్

    భారత్‌ వ్యాప్తంగా ఈ చిత్రం 2140 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. యానిమేషన్ మూవీకి ఇంత అద్భుతమైన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేశారు.

    లోకల్ స్టార్ల డబ్బింగ్ మరింత ప్లస్ అయింది

    లోకల్ స్టార్ల డబ్బింగ్ మరింత ప్లస్ అయింది

    నేటివిటీ ఎఫెక్ట్ కోసం లోకల్ స్టార్లతో డబ్బింగ్ చెప్పించడం సినిమాకు మరింత ప్లస్సయింది. ఈ చిత్రం‌లో అతి కీల‌క‌మైన ముఫాసా పాత్రకు హీందీలో షారుఖ్ ఖాన్‌, తెలుగులో పి.ర‌విశంక‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. హీరో సింబా పాత్ర‌కి హిందీలో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు‌లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు.

    ది లయన్ కింగ్

    ది లయన్ కింగ్

    విల‌న్ స్కార్ పాత్ర‌కి జ‌గ‌ప‌తి బాబు, టైమ‌న్ అనే ముంగిస పాత్ర‌కి ఆలీ, పుంబ అనే అడవి పంది పాత్ర‌కి ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం డ‌బ్బింగ్ చెప్పారు. డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఫస్ట్ వీకండ్ ప్రపంచ వ్యప్తంగా రూ. 3 వేల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Trade analyst Taran Adarsh tweeted the latest box office figures of Disney’s The Lion King and wrote, “#TheLionKing is remarkable on Day 2… As predicted, kids and families throng cinema halls, resulting in biz hitting [near] optimum levels at places… Day 3 will be huge again… Eyes ₹ 50 cr+ weekend… Fri 11.06 cr, Sat 19.15 cr. Total: ₹ 30.21 cr. India biz. All versions.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X