Diwali Box Office: విశాల్ vs రజనీకాంత్.. మారుతి మంచిరోజులు.. ముగ్గురి బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
సినిమా ఇండస్ట్రీలకు ఎక్కువగా పండగ సీజన్స్ ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా అందుకోవాలి అంటే అందరూ ఎక్కువగా ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా ప్రేక్షకులను పండగ వాతావరణంలో సినిమా చూడాలని అనుకుంటున్నారు కాబట్టి సినిమా పై పెట్టిన పెట్టుబడిని చాలా తొందరగా అందుకోవడమే కాకుండా వీలైనంత ఎక్కువగా ప్రాఫిట్స్ కూడా అందుకనే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీ లో కూడా ఎక్కువ మంది ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఈ దీపావళికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. రజనీకాంత్ పెద్దన్న, విశాల్ ఆర్య ఎనిమీ, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచిరోజులొచ్చాయి ఒకేసారి బాక్సాఫీస్ వద్ద వాటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

మూడు సినిమాల మధ్య పోటీ
ఇక ఈ పోటీలో రజనీకాంత్ విశాల్ డబ్బింగ్ సినిమాలతో వస్తుండగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచిరోజులొచ్చాయి సినిమా డైరెక్ట్ తెలుగు సినిమాగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ పోటీలో కాస్త ఎక్కువగా హడావుడి చేసే అవకాశం ఉంది. ఇక విశాల్ కూడా ఎనిమీతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎంత టార్గెట్ తో విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం.

పెద్దన్న టార్గెట్ ఎంతంటే?
దీపావళి సందర్భంగా పెద్దన్న సినిమాను విడుదల చేయబోతున్నట్లు రజినీకాంత్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక మొత్తానికి సినిమాలు తెలుగులో కూడా భారీగానే విడుదల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 650 పైగా థియేటర్లలో పెద్దన్న సినిమా విడుదల కాబోతోంది. ఇక రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12.5 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఇక 13 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి దిగుతున్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో వసూళ్ళు అందుకుంటుందో చూడాలి.

విశాల్ ఎనిమీ మినీ టార్గెట్
విశాల్ ఆర్య కలిసి నటించిన ఎనిమీ సినిమాకు ప్రస్తుతం అయితే పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. కానీ విశాల్ మాత్రం ప్రమోషన్ డోస్ పెంచేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మొత్తంగా 330కి పైగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో 5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎనిమీ 5.5కోట్ల బ్రేక్ ఈవెన్ తో మార్కెట్లోకి దిగుతోంది. మరి ఆ టార్గెట్ ను విశాల్ ఆర్య వారి స్టార్ ఇమేజ్ తో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చూడాలి.
Recommended Video

మంచిరోజులొచ్చాయి... టార్గెట్ ఎంతంటే?
కామెడీ సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న మారుతీ ఈసారి అదే తరహాలో తన సక్సెస్ ఫార్ములాని ఉపయోగిస్తున్నాడు. సంతోష్ శోభన్ మెహ్రీన్ జంటగా నటించిన మంచి రోజులొచ్చాయి సినిమాను దీపావళి రోజు విడుదల అవుతోంది. సినిమాలో కరోనా లాక్ డౌన్ నేపథ్యాన్ని కూడా జోడించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో 250 కి పైగా థియోటర్స్ లో విడుదల అవుతున్న మంచి రోజులోచ్చాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా 11 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంటేనే హిట్ ఆగినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











