DJ Tillu Closing Collections 17 రోజుల్లో దుమ్మురేపిన డీజే టిల్లు.. ఎన్ని కోట్ల లాభమంటే?
టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసిన చిత్రం డీజే టిల్లు. రిలీజ్‌కు ముందే పాటలు, టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఇక రిలీజ్ తర్వాత అదే ఆసక్తిని కొనసాగిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సిద్దూ జొన్నలగడ్డ నటించిన గత రెండు వారాలకుపైగా డీజే టిల్లు చిత్రం నిర్మాత నాగవంశీకి భారీ లాభాలను పంచింది. ఈ సినిమా 17 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..
Recommended Video

డీజే టిల్లు క్లోజింగ్ కలెక్షన్లు
డీజే టిల్లు సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి క్రేజ్ ఉండటంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. కొత్త నటీనటుల, దర్శకుడైనా భారీ బడ్జెట్ సినిమాకు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. నైజాం హక్కులు రూ.2.80 కోట్లకు, సీడెడ్‌లో 1.50 కోట్లు, ఆంధ్రా 3.40 కోట్ల రూపాయలతో మొత్తంగా 7.70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. 60 లక్షలకు అమ్ముడుపోయింది. ఓవర్సీస్ హక్కులు 65 లక్షలతో కలిపి మొత్తంగా 8.95 కోట్ల వద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజైంది.

భీమ్లా నాయక్ ప్రభావంతో
డీజే టిల్లు చిత్రం రిలీజ్ తర్వాత ఏకధాటిగా రెండు వారాలు భారీగా వసూళ్లను రాబట్టింది. మూడో వారంలో భీమ్లా నాయక్, వలిమై లాంటి భారీ చిత్రాల కారణంగా ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. దాంతో మూడో వారం పూర్తిగా పడిపోయాయి. 17వ రోజున కేవలం 7 లక్షల రూపాయలు వసూలు చేయడం గమనార్హం. దాంతో ఈ సినిమా రన్ బాక్సాఫీస్ వద్ద ముగిసిందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేశాయి.

9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో
డీజే టిల్లు చిత్రం 9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి రోజు రూ.3.18 కోట్లు, రెండో రోజు 2.62 కోట్లు, మూడో రోజు 1.40 కోట్లు వసూలు చేసింది. దాంతో బ్రేక్ ఈవెన్‌కు ఈ చిత్రం చేరువైంది. దాంతో భారీ లాభాలు సాధించడం పెద్ద కష్టమేమి కాదేనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది

నైజాం, ఏపీలో వసూళ్లు
డీజే టిల్లు గత 17 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 7.11 కోట్లు, సీడెడ్‌లో 1.88 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.39 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 79 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 80 లక్షలు, గుంటూరులో 77 లక్షలు, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరులో 46 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 13.86 కోట్లు నికరంగా, 24 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
తెలుగేతర రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.01 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ.2.05 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16.92 కోట్ల నికరంగా, 29.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే.. 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ప్రారంభమైన ఈ చిత్రం 7.42 కోట్ల లాభాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











