Box Office: మృణాల్ థాకూర్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. పనిచేయని సంజయ్ లీలా భన్సాలీ మ్యాజిక్!
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు సిద్దాంత్ చతుర్వేది, మృణాళ్ థాకూర్ నటించిన తాజా చిత్రం దో దివానే షెహర్ మే. రొమాంటిక్, లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భన్సాలీ ప్రొడక్షన్స్, రవి ఉద్యవార్ మీడియా, రాన్‌కార్ప్ ప్రొడక్షన్స్, జీ స్టూడియో బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ భన్సల్, భరత్ కుమార్ భన్సల్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హేషమ్ అబ్దుల్ వాహబ్, శ్రేయాస్ పర్నిక్, జైదేవ్, జాకీ వంజరీ సంగీతం అందించారు. కౌశల్ షా సినిమాటోగ్రఫి, మనిషా బల్దావా ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ 2026 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. శశాంక్ శర్మ (సిద్దాంత్ చతుర్వేది), రోష్ని శ్రీవాస్తవ (మృణాల్ థాకూర్) ఇద్దరు బయటి ప్రపంచానికి ఆత్మ విశ్వాసంతో కనిపించినా.. కొన్ని శారీరక లోపాల వల్ల ఆత్మనూన్యత భావంతో మానసికంగా బాధపడుతుంటారు. అయితే పెళ్లి చూపుల కోసం ఈ ఇద్దరు కలుస్తారు. అయితే తొలి చూపులోనే రోష్నిని శశాంక్ ప్రేమిస్తాడు. కానీ పెళ్లిచూపుల్లో శశాంక్‌ను రోష్మి రిజెక్ట్ చేస్తుంది. అయినా ఆమెను శశాంక్ వెంబడిస్తాడు. చివరకు రోష్మిని మనసును గెలుచుకొని ప్రేమించేలా చేసి డేటింగ్ చేస్తుంటాడు. అయితే ఓ కారణంగా శశాంక్ చేసిన పని నచ్చక అతడికి బ్రేకప్ చెబుతుంది.
శశాంక్, రోష్మికి ఉన్న మానసిక బలహీనతలు ఏంటి? శశాంక్‌ను పెళ్లిచూపుల్లో ఎందుకు రిజెక్ట్ చేసింది? రోష్మిని పెళ్లికి ఎలా ఒప్పించాడు? పెళ్లికి ముందు డేటింగ్ చేస్తున్న సమయంలో శశాంక్‌కు రోష్ని ఎందుకు బ్రేకప్ చెప్పింది? చివరకు ఇద్దరు తమ బలహీనతలను అధిగమించారా? వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారా? అనేది ఈ సినిమా కథ.
రొమాంటిక్ లవ్ స్టోరీని దర్శకుడు సంజయ్ లీలా భన్నాలీ నిర్మాతగా మారి రూపొందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 30 కోట్ల మేర వాల్యూ కట్టారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయడంతో సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మీడియం రేంజ్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
రిలీజ్‌కు ముందు ఉన్న క్రేజ్‌ను ఈ సినిమా కలెక్షన్లుగా మార్చలేకపోయిందనే విషయం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతున్న వసూళ్లను చూస్తే స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ చిత్రం తొలి రోజున 1.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5.35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఏదో మ్యాజిక్ జరిగితే తప్పా ఆ లక్ష్యాన్ని అధిగమించేలా కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











