50 లక్షల రూపాయల బడ్జెట్.. 2000 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు.. ఆ సినిమా పేరు ఏంటో తెలుసా?

సినిమా పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనకవర్షం కురిపించిన దాఖలాలు అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తుంటాయి. భారీ బడ్జెట్‌ స్టార్ హీరోల సినిమాలు ఎలాంటి లెక్కలు లేకుండా రికార్డు కలెక్షన్లు రాబడుతుంటాయి. చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదో స్పెషాలిటీ ఉండాల్సిందే. అలా ఓ స్పెషాలిటీతో వచ్చిన ఓ చిన్న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సినీ చరిత్రలో 1999 సంవత్సరంలో ఓ అద్భుతం జరిగింది. దెయ్యాల సినిమాలు, సస్సెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచేజ్ అనే దర్శకద్వయం ఓ సూపర్ నేచురల్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా పేరు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project).

The Blair Witch Project

ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) సినిమా కథ విషయానికి వస్తే.. ముగ్గురు యువకులు ఓ ప్రాజెక్ట్ కోసం వెళ్తారు. అయితే ప్రాజెక్ట్ పని మీద వెళ్లిన ముగ్గురు కనిపించకుండా పోతారు. వారు అలా అదృశ్యమైన ఏడాదికి వారికి సంబంధించిన మూడు కెమెరాలు లభ్యమవుతాయి. ఆ కెమెరాల్లో లభ్యమైన ఫుటేజ్‌లో ఆ ముగ్గురికి ఏమైందనే విషయమే సినిమా కథ. ఆ ముగ్గురు యువకుల పాత్రలను హీతర్ డేన్యూ, మైఖేల్ విలియమ్స్, జోషువా లియోనార్డ్ పోషించారు.

ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) సినిమాకు తొలుత ది బ్లాక్ హిల్స్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. అనంతరం ఈ సినిమాకు ది బ్లెయిర్ విచ్ అని అనుకొన్నారు. చివరకు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) అని టైటిల్ ఫిక్స్ అయ్యారు. టైటిల్ ఏమైనా కంటెంట్ మ్యాజిక్ చేయడంతో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది.

The Blair Witch Project

ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) సినిమాను తొలుత సండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 1999 సంవత్సరంలో జనవరి 23వ తేదీన ప్రీమియర్‌గా ప్రదర్శించాడు. జూలై 14వ తేదీన న్యూయార్క్ సిటీలో రిలీజ్ చేశారు. అనంతరం జూలై 30న అమెరికా వ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) సినిమాను సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రేక్షకులు విశషంగా ఆదరించడంతో భారీ విజయాన్ని అందుకొన్నది. కేవలం భారీ విజయం కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం మొత్తంగా 2074 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

The Blair Witch Project

అమెరికాలో భారీ విజయం సాధించిన ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project) చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది. సూపర్ నేచురల్ హారర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను అమెజాన్‌లో చూడవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X