1000 కోట్లతో బాలీవుడ్ ను దివాలా తీయించిన సూపర్ స్టార్.. రెమ్యునరేషన్ స్థాయి కలెక్షన్ రాబట్టలేక పోతున్న ఆ హీరో
ఎప్పుడు ఏ స్టార్ హీరో స్టేటస్ ఎలా మారుతుందో ఎవరికీ అర్ధం కాదు. భారీ మార్కెట్ నుంచి జీరో మార్కెట్ లోకి పడిపోయిన హీరోలు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో స్టార్ హీరో కోసం అంతా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఆ హీరో సినిమాలకి ఒకప్పుడు మంచి టాక్ వస్తే సునాయాసంగా 200 కోట్ల వసూళ్లు ఈజీగా వచ్చేసేవి. ఇదే స్ట్రీక్ లో వరుస సినిమాలు నాన్ స్టాప్ గా ఆ స్టార్ హీరో చేసేవాడు.
అయితే వాటిలో కొన్ని పెద్ద బజ్ లేకుండా వచ్చినవి కూడా కంటెంట్ బాగుండడంతో అదరగొట్టాయి. అలా భారీ లాభాలు అందిస్తూ వచ్చిన ఆ స్టార్ హీరో ఇప్పుడు ఒకటి కాదు రెండు ఏకంగా 1000 కోట్ల నష్టాలని బాలీవుడ్ మార్కెట్ లో మిగిల్చాడట. కాగా ఆ హీరోనే బాలీవుడ్ సినిమా స్టార్ హీరో అక్షయ్ కుమార్. అక్కీ ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలు చేసాడు. కానీ ఇప్పుడు వరకు చేసిన ఈ అన్ని సినిమాలను మించి భారీ నష్టాలు కేవలం ఈ కొన్నేళ్లలోనే మిగిల్చాడట.

అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ చిత్రమే "సర్ఫిరా". ఈ సినిమా దెబ్బతో మరోసారి బాలీవుడ్ ట్రేడ్ షాక్ లోకి వెళ్ళిపోయింది. అయితే అక్షయ్ నటించిన గత కొన్ని చిత్రాలు వరుసగా చూస్తే బడే మియా చోటే మియా, రామ్ సేతు, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, బెల్ బాటమ్, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, లక్ష్మి బాంబ్, ఇంకా కొన్ని సినిమాలు కలిపి ఏకంగా తాను 1000 కోట్ల నష్టాన్ని మిగిల్చాడట.
ఒకప్పుడు ఖిలాడీ ఆఫ్ బాలీవుడ్ అని హిట్ రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇంత దారుణంగా డౌన్ ఫాల్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. కాగా ఈ పైన చిత్రాల్లో ఒక్క బడే మియా చోటే మియా, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలే సుమారు 400 కోట్లకి పైగా మిగిల్చాయట. ఇక మిగతా సినిమాలు అన్నీ కలిపి మిగతా మొత్తంలో నష్టాలు మిగిల్చాయట. దీనితో అక్షయ్ కుమార్ దారుణంగా డౌన్ ఫాల్ చూడాల్సి వచ్చింది.

కాగా ఇంత దారుణంగా డౌన్ అవ్వడానికి అక్షయ్ కుమార్ నే ప్రధాన కారణం అని చెప్పాలి. ప్రస్తుతం ట్రెండ్ లో ఎవరూ రీమేక్ లు చూసేందుకు ఇష్టడపడం లేదు కానీ ఏవ్ రీమేక్ చిత్రాలు అక్షయ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. పోనీ స్ట్రైట్ సినిమాలు చేస్తే ముందులా కంటెంట్ ఉండడం లేదు. ఇక కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కూడా కొన్ని సినిమాలు చేసి హిట్ కొట్టాడు కానీ ఆ ఫార్ములా అన్ని సార్లు వర్కౌట్ కాలేదు.
ఇలా అన్ని పక్కలా కూడా అక్షయ్ తనకి తానె శత్రువు అయ్యాడు. దీనితో ఫలితం బాలీవుడ్ మార్కెట్ లో 1000 కోట్ల నష్టం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనితో బాలీవుడ్ మార్కెట్ దివాళా తీసే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. అక్షయ్ కుమార్ ఒకో సినిమాకి 60 కోట్ల నుంచి 100 కోట్లకి పైగానే రెమ్యునరేష తీసుకుంటాడట.
కానీ పైన చెప్పిన అన్ని చిత్రాల్లో చాలా సినిమాలు తన రెమ్యూనరేష లో సగం కూడా రాబట్టలేక పోయాయి. తాను చేసిన గత పది పదిహేను సినిమాల్లో ఒకే ఒక్క హిట్ ఉంది అది కూడా డివోషనల్ సినిమా "ఓ మై గాడ్ 2". గత ఏడాది వచ్చిన ఈ చిత్రం మాత్రం 200 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని ఓకే అనిపించింది. దీని మొదటి భాగాన్నే తెలుగులో విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో "గోపాల గోపాల" గా రీమేక్ చేశారు.


Click it and Unblock the Notifications











