Dunki షారుక్ కెరీర్‌లోనే అతి తక్కువ వ్యయంతో డంకీ.. రిలీజ్‌కు ముందే భారీ లాభాలు.. బడ్జెట్ ఎంతంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన డుంకీ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు లాంటి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నాయి. అయితే ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్‌లోనే కొన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకొన్నది. ఆ స్పెషల్ అంశాల వివరాల్లోకి వెళితే..
షారుక్ ఖాన్ నటించే సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇటీవల ఆయన నటించిన రెండు పఠాన్, జవాన్ చిత్రాలు 300 కోట్ల రూపాయలకుపైగానే బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్న షారుక్ సినిమా మాత్రం తన కెరీర్‌లోనే అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల కాలంలో షారుక్ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా అంటే 90 కోట్ల రూపాయలతో నిర్మించారని చెప్పుకొంటారు. ఆ తర్వాత ఆయన నటించిన రాయిస్ సినిమా బడ్జెట్ 95 కోట్ల రూపాయలు. డిజాస్టర్‌గా మారిన జీరో సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

అయితే ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజు హిరాణీ రూపొందించిన డంకీ చిత్రం షారుక్ ఖాన్ కెరీర్‌లో అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా మారింది. ఈ సినిమాను 85 కోట్ల రూపాయలతో నిర్మించారు. గత ఏడు సంవత్సరాల్లో అతి తక్కువ వ్యయంతో రూపొందిన సినిమా అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నారు. అంతేకాకుండా రిలీజ్‌కు ముందే భారీ లాభాలు సాధించిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నదని తెలిపారు.
అయితే ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ అతి తక్కువ రోజులు నటించిన సినిమా డంకీగా పేర్కొంటున్నారు. ఈ సినిమా మొత్తం 75 రోజుల్లో షూట్ చేస్తే.. షారుక్ ఖాన్ మాత్రం 60 రోజులు మాత్రమే షూట్‌లో పాల్గొన్నారు. అయితే బాలీవుడ్ బాద్షా కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు చెప్పుకొంటున్నారు.

డంకీ చిత్రంలో షారుక్‌తోపాటు వికీ కౌశల్, తాప్సీ పన్ను తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అవుతున్నది. బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











