Doctor movie Day 2 collections..దుమ్ము రేపుతున్న శివకార్తీకేయన్.. మౌత్ టాక్‌తో ఊహించని కలెక్షన్లు
తమిళ నటుడు శివకార్తీకేయన్ నటించిన డాక్టర్ చిత్రం థియేటర్లలో రిలీజై తొలి ఆట నుంచే మౌత్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు కలిసి నటించిన ఈ చిత్రంలో భావోద్వేగమ కథతోపాటు కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. అయితే ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు
వరుణ్ డాక్టర్ చిత్రంపై రిలీజ్‌కు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా బిజినెస్ తెలుగు, తమిళ థియేట్రికల్ హక్కులను సుమారు 35 కోట్లకుపైగా అమ్మినట్టు సమాచారం. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 36.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇలాంటి లక్ష్యంతో బాక్సాఫీస్ పరుగును ప్రారంభించింది.

ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా టాక్
శివ కార్తీకేయన్ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాక్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ వెళ్తున్నది. అయితే మౌత్ టాక్ బ్రహ్మండంగా ఉండటంతో రెండో రోజు 100కుపైగా థియేటర్లను తెలుగు రాష్ట్రాల్లో పెంచారు.

తొలి రెండు రోజుల్లో
డాక్టర్ చిత్రం తొలి రోజు ఈ చిత్రం తెలుగు 22 లక్షల రేంజ్‌లో షేర్‌ను సాధించింది. ఇక రెండో రోజు డాక్టర్ చిత్రం రూ.37 లక్షల రూపాయలు నికర వసూళ్లను సాధించింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ తొలివారాంతంలో పెరిగాయి. తొలివారాంతం తర్వాత కూడా అంటే.. సోమవారం కూడా మంచి వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఓవరాల్‌గా రెండు రోజుల్లో
గత రెండు రోజుల్లో డాక్టర్ చిత్రం వసూళ్లను ప్రాంతాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రూ.16 లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.8.2 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 లక్షలు, గుంటూరు జిల్లాలో 6 లక్షలు, కృష్ణా జిల్లాలో 6 లక్షలు, నెల్లూరులో 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 59 లక్షల నికరంగా, రూ.1.05 కోట్లు గ్రాస్ వసూళ్ను సాధించింది.

లాభాల్లోకి రావాలంటే
తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు రూ.1.35 కోట్లకు అమ్మారు. దాంతో ఈ చిత్రం రూ.1.5 కోట్లు సాధిస్తే తప్ప లాభాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం 56 లక్షలు సంపాదించగా. ఇంకా లాభాల్లోకి రావాలంటే.. 1.5 కోట్లు సంపాదించాల్సి ఉంది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
ఇక తమిళ రాష్ట్రాల్లో డాక్టర్ సినిమా భారీగా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు రూ.6.7 వసూళ్లను సాధించింది. రెండో రోజు రూ.8.1 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 14.8 కోట్లు రాబట్టింది. ఇంకా ఈ చిత్రం 21 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











