Doctor Strage 2 day 1 Collections.. స్పైడర్ మ్యాన్ కలెక్షన్లకు ధీటుగా.. బాలీవుడ్ సినిమాలను మించి వసూళ్లు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన మార్కు సంచలనాలను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి రోజున భారీగా వసూళ్లును రాబట్టింది. బాలీవుడ్ అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసింది. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాకు ధీటుగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది.

డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌ను సూపర్‌గా ప్రారంభించింది. తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం 22 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనాలు వేశారు. అయితే ఈ సినిమాకు కేజీఎఫ్2 చిత్రం నుంచి భారీగా ప్రతిఘటన ఎదురవుతున్నది.

Doctor Strage 2 day 1 India collections

ప్రపంచ బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున 27.50 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇక శని, ఆది వారాల్లోకూడా అదే ఊపు కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గతంలో అత్యధిక ప్రేక్షకదారణ పొందిన స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా తొలి రోజున 32.67 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే డాక్టర్ స్రేంజ్ 2 చిత్రం అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు వేసిన అంచనాలు గురితప్పాయి. అయితే ఈ చిత్రం ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రాల కంటే ఎక్కువగానే వసూలు చేయడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X