Doctor Strange 2 రిలీజ్‌కు ముందే రికార్డు కలెక్షన్లు.. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ రికార్డులపై గురి
హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ధి మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రం విడుదలకు ముందే భారీ వసూళ్లను నమోదు చేసున్నది. మే 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే ఈ చిత్ర ప్రీమియర్స్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బ్రేక్ చేసింది.
స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ లాంటి సినిమాల కంటే తక్కువ పాపులారిటీ ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం భారీ కలెక్షన్లు సాధించడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ో వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

అయితే రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజుల ముందే డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం 20 కోట్ల వసూళ్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సంపాదించింది. ఈ కలెక్షన్ల మొత్తం మే 6వ తేదీన నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టిన వసూళ్లు చూస్తేంటే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. గురువారం రాత్రి వరకు ఈ సినిమా 30 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. పూర్తిస్థాయిలో టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా తొలి రోజున దేశవ్యాప్తంగా 32.67 కోట్లు వసూలు చేసింది. ఇక అవెంజర్ ఎండ్ గేమ్ చిత్రం 31 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ రెండు చిత్రాల కంటే డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం అధికంగా రాబట్టే అవకాశం ఉంది.
డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రంలో బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, ఎలిజబెత్ ఒస్లేన్ నటించారు. ఈ సినిమాకు సామ్ రైమీ దర్శకత్వం వహించారు. పలువురు ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











