twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Doctor Strange 3 days collections ఇండియాలో 100 కోట్లకు చేరువగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

    |

    హాలీవుడ్‌లో సంచలనాలను సృష్టిస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్సె ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రం ప్రపంచవ్యావ్తంగా భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధించి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సీక్వెల్స్‌లో అత్యధిక వారాంతపు వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 2016లో వచ్చిన డాక్టర్ స్రేంజ్ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మూడు వారాల కలెక్షన్ల విషయానికి వస్తే..

    గత మూడు రోజుల్లో డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. వారాంతానికి 450 మిలియన్ల డాలర్లను వసూలు చేిసంది. అమెరికాలో 185 మిలియన్ డాలర్లు, ఇతర దేశాల్లో 265 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    Doctor Strange in the Multiverse of Madness day 3 worldwide collections: near to 100 crores at Indian box office

    కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా స్పైడర్ మ్యాన్: నో వే హోం నిలిచింది.ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

    ఇక ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం 79.50 కోట్లు రాబట్టింది. బాలీవుడ్, కేజీఎఫ్2 చిత్రాల పోటీని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఆదివారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా 29.23 కోట్లు రాబట్టింది. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది.

    డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రంలో జోచిటల్ గోమేజ్, బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓస్లేన్, రాచెల్ మాక్ ఆడమ్స్, బెనెడిక్ట్ వోంగ్ తదితరులు నటించారు.

    English summary
    Benedict Cumberbatch's Doctor Strange in the Multiverse of Madness is released on the May 7th. It collected 79.50 collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X