Doctor Strage 2 day 4 Collections.. దారుణంగా కలెక్షన్లు.. బాక్సాఫీస్‌పై పనిచేయని మార్వెల్ మ్యాజిక్

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ (డాక్టర్ స్ట్రేంజ్ 2) చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సంచలన వసూళ్లను నమోదు చేసింది. గత మూడు రోజులుగా రికార్డు వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం ఇండియాలో అంతగా మ్యాజిక్ చేయడం లేదనే విషయం ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి వారాంతంలో 2022 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ హాలీవుడ్ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. అయితే తొలి వారాంతం తర్వాత మొదటి సోమవారం అదే ఊపును క్రియేట్ చేసింది.

భారతీయ భాషల్లో డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం ఓ మోస్తారు కలెక్షన్లతో కొనసాగుతున్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషల్లో 94.54 కోట్లు రాబట్టింది. తొలి రోజున అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా కలెక్షన్లను అధిగమించలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మూడు రోజుల్లో 79.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం నాలుగో రోజున 10.30 కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇంగ్లీష్ భాషలో 7.70 కోట్ల గ్రాస్, హిందీలో 2.30 కోట్లు, ఇతర భాషల్లో 30 లక్షలతో మొత్తం 10.30 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 89.80 కోట్ల నమోదు చేసింది.

Doctor Strange in the Multiverse of Madness day 4 worldwide collections: Heavy drop at Indian box office

అయితే డాక్టర్ స్ట్రేంజ్ సినిమాకు ముందు ఉన్న క్రేజ్‌ను ఈ సినిమా పాజిటివ్‌గా మలుచుకోలేకపోయిందనే విషయం తాజా కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం భారీగా వసూళ్లలో కోత పడటం ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. ఈ సినిమా భారత్‌లో మ్యాజిక్ చేసే అవకాశం లేదనే విషయం స్ఫష్టంగా కనిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, ఇంటర్నేషన్ మార్కెట్‌లో డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం $265 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా 450 మిలియన్ డాలర్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X