Dominic and the Ladies Purse Collections: బాక్సాఫీస్ వేట మొదలెట్టిన మమ్ముట్టి.. డొమినిక్‌కు ఎన్ని కోట్ల కలెక్ష
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించి నిర్మించిన తాజా చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో గోకుల్ సురేష్, లీనా, సుస్మిత భట్, మీనాక్షి ఉన్నికృష్ణన్, వినీత్, సిద్దిఖీ, షైన్ టామ్ చాకో, విజయ్ బాబు తదితరులు నటించారు. జనవరి 23వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
డొమినిక్ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా మారిన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కథ. అదృశ్యమైన వ్యక్తులు, హంతకుల వేట, మిస్పింగ్ అయిన ఓ డాన్యర్ ఆచూకీ గురించి పరిశోధన జరిపే మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్బుకా శివ మ్యూజిక్ అందించగా, విష్ణుదేవ్ సినిమాటోగ్రఫి బాధ్యతను నిర్వర్తించారు.

డొమినిక్ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా మంచి క్వాలిటీతోను, అలాగే టాలెంటెడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులతోను తెరకెక్కించారు. దాంతో ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ వ్యయంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో రూపొందించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించడంతో సినిమా అంచనాలు పెరగడంతో భారీగా బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమా 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా రిలీజైంది.
భారీ అంచనాలు, మంచి టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్సాన్స్ లభించింది. ఈ మూవీకి మీడియం రేంజ్ ఆక్యుపెన్సీ రికార్డైంది. ఓవరాల్‌గా కేరళలో 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, త్రిచూర్, అలెప్పీ, కొట్టాయం, కొజికోడ్, హైదరాబాద్, బెంగళూరులో 40 శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక గౌతమ్ మీనన్, మమ్ముట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు మీడియం రేంజ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే గతంలో మమ్ముట్టి నటించిన సినిమాలను మించి వసూళ్లు రాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా కేరళలో తొలి రోజు 2.5 కోట్ల రూపాయల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మౌత్ టాక్ పెరిగితే.. వీకెండ్‌లో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











