Don movie 10 days collections.. 100 కోట్లకు చేరువగా శివ కార్తీకేయన్ మూవీ.. బాక్సాఫీస్‌పై భారీ పంజా!
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎలాంటి హంగామా, ఆర్బాటం లేకుండా సైలెంట్‌గా రిలీజై భారీ విజయం అందుకొన్న చిత్రం డాన్. తమిళ నటుడు శివ కార్తీకేయన్, ప్రియా అరుళ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రం ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా భారీ విజయాన్ని అందుకొన్నది. 10 రోజుల తర్వాత కూడా డాన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించడం గమనార్హం. గత పది రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..
.

సర్కారు వారి పాట కారణంగా
సర్కారు వారి పాట సినిమాతో పోటీ పడుతూ శివ కార్తీకేయన్ నటించిన డాన్ చిత్రం దక్షిణాదిలో రిలీజైంది. సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ల కారణంగా డాన్ రిలీజ్ గురించి పెద్దగా తెలియలేకపోయింది. అయితే పబ్లిక్ టాక్ భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తూ.. రెండో వారంలోకి ప్రవేశించింది.

10 రోజల్లో డాన్ మూవీ కలెక్షన్లు
డాన్ చిత్రం గత పది రోజుల్లో 73 లక్షలు, సీడెడ్‌లో 24 లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 13 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 లక్షలు, కృష్ణా జిల్లాలో 10 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షల రూపాయలు సాధించింది. దీంతో ఈ చిత్రం 3.4 కోట్ల గ్రాస్, 1.71 కోట్ల షేర్ సాధించింది.

రెండోవారంలో పుంజుకొన్న కలెక్షన్లు
డాన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల హక్కులను 1.5 కోట్లకు ఎన్వీ ప్రసాద్ దక్కించుకొన్నారు. సర్కారు వారి పాట కారణంగా భారీగా ఈ సినిమాకు థియేటర్లు లభించలేకపోయాయి. అయితే రెండో వారంలో సర్కారు వారి పాట సినిమా ఆదరణ తగ్గడంతో డాన్ వసూళ్లు పుంజుకొన్నాయి. దాంతో ఈ చిత్రం 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

తమిళనాడులో వసూళ్ల జైత్రయాత్ర
ఇక తమిళనాడులో వసూళ్లు విషయానికి వస్తే.. తొలివారంలో డాన్ చిత్రం 45.83 కోట్లు సాధించింది. రెండో వారంలో మొదటి శుక్రవారం 4.90 కోట్లు, శనిావరం 5.22 కోట్లు, ఆదివారం 5.79 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే 61.74 కోట్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా..
అలాగే దక్షిణాదిలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 3.85 కోట్లు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో 18.10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 85.30 కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా 100 కోట్ల మార్కు వైపు పురుగులు తీస్తున్నది.


Click it and Unblock the Notifications











