రవితేజ డాన్ శీను ఫస్ట్ డే కలెక్షన్ అంతా?
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకుడుగా పరిచయం అవుతూ రూపొందిన డాన్ శ్రీను రికార్డు కలెక్షన్ వసూలు చేసిందంటున్నారు. రవితేజ కెరీర్ లోనే ఫస్ట్ డే ఎనభై ఐదు లక్షలు వసూలు చేయటం ఇదే మొదటిసారి అని లెక్కలు చెప్తున్నారు. రవితేజకి పెద్ద హిట్టు నమోదు చేసిన కిక్ ఫస్ట్ డే..62 లక్షలు వసూలు చేసిందని,దాంతో పోలిస్తే డాన్ శీను...సీన్ పెరిగినట్లేనని నిర్ధారిస్తున్నారు. అలాగే రవితేజ..గత చిత్రాలు శంభో శివ శంబో, ఆంజనేయులు ఆడక పోయినప్పటికీ ఈ రేంజిలో కలెక్షన్స్ వసూలు చేయటం ఆశ్చర్యకరమంటున్నారు. ఇక ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. అయినా సినిమా నిజంగా హిట్టయితే ఈ లెక్కలుతో పనేముంది..కలెక్షన్స్ గురించి మాట్లాడేదేముంది.
డాన్ శీను రవితేజ శ్రియ కోన వెంకట్ గోపీచంద్ మలినేని don seenu ravi teja shriya kona venkat shambho siva shambho


Click it and Unblock the Notifications