'డాన్ శీను' హిందీ రీమేక్ రైట్స్ ఎంతకు అమ్మారంటే...
రవితేజ, శ్రియ కాంబినేషన్ లో వచ్చిన 'డాన్ శీను' చిత్రం రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్ధ కొనుగోలు చేసిందని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో రీమేక్ చేసేందుకే తీసుకున్నారని, అందునిమిత్తం పాతిక లక్షలు రూపాయలు చెల్లించాలని తెలుస్తోంది.అయితే డబ్బింగ్ రైట్స్ తో సహా ఈ రేటు పలికింది. శ్రియ ఉంది కాబట్టి డబ్బింగ్ చేసి భవిష్యత్ లో శాటిలైట్ కి విక్రయిస్తారు. ఇక ఇక్కడ 'డాన్ శీను' చిత్రం మొదట బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, అన్ని సినిమాలు వరసగా ఫ్లాఫ్ కావటం కలిసి వచ్చి మెల్లిగా కలెక్షన్స్ పరంగా హిట్ టాక్ కి సెటిలైంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ రైట్స్ కూడా అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఇక మొన్నా మధ్యే తమిళంలో ఇదే సంస్ధ, సేమ్ హీరోతో నిర్మించిన కిక్ చిత్రాన్ని జయం రవితో తీసి చేతులు కాల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











