బెంగుళూరులో 'దూకుడు' పొజీషన్ ఏంటి?
అన్ని చోట్ల అదరగొడుతున్న మహేష్ దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. అక్కడ ట్రేడ్ రిపోర్ట్ ల ప్రకారం..బెంగుళూరు మఠహళ్లిలోని రాధాకృష్ణ థియేటర్‌లో ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. టికెట్లను బ్లాక్‌లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మేహ ష్ అభిమానులు థియేటర్ వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహిచారు. పంపిణీ దారుడు ఎన్‌సీ. నాగరాజ్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ నగర, ఫ్రేజర్ టౌన్, ఆర్‌టీ. నగర, జీవనహళ్లి, హెచ్‌ఏఎల్, ఎంఆర్. పాళ్యలకు అభిమానులు ఆర్. రఘు, పీ. తిరుపాల్, ఎంకే. లోకనాథ్, మత్తయ్య, ప్రభు, బాషా, మాల్యాద్రి, పీ. నాగయ్య, ప్రసాద్, తిరుపతయ్య, పంబ తిరుపాలు, కే. మాధవరావు, గురు, మూర్తి, ఎన్. శివప్రసాద్‌లు థియేటర్ వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పూలమాలలతో అలంకరించారు.
ఇక ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్‌ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది . 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.


Click it and Unblock the Notifications











