Double Ismart Closing Collections: డబుల్ ఇస్మార్ట్ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల నష్టమంటే?
టాలీవుడ్‌లో భారీ విజయం అందుకొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుడిని మెప్పించలేకపోవడంతో డిజాస్టర్‌గా మారింది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
డబుల్ ఇస్మార్ట్ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్లు (6 కోట్ల రిటర్న్) రూపాయల మేర జరిగింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రాన్ని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకొని రిలీజ్ చేశారు.

ఇక ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు విషయానికి వస్తే.. ఆంధ్ర, నైజాంలో 43 కోట్ల మేర, ఓవర్సీస్ 5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 54 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 54 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా తొలి రోజు 7 కోట్ల రూపాయలతో భారీ వసూళ్లు సాధించింది. అయితే సినిమా టాక్ నెగిటివ్‌గా మారడంతో రెండో రోజు భారీ పతనంతో 1.4 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 1.15 కోట్లు, 4వ రోజు 1.35 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతం తర్వాత మరింతగా కలెక్షన్లు క్షీణించాయి.
తొలివారాంతం తర్వాత తెలుగు వెర్షన్ డబుల్ ఇస్మార్ట్ చిత్రం కోలుకోలేకపోయింది. 5వ రోజు 90 లక్షలు, 6వ రోజు 5 లక్షలు, 7వ రోజు 50 లక్షలు, 8వ రోజు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 13.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 45 లక్షలు, రెండో రోజు 10 లక్షలు, 3వ రోజు 15 లక్షలు, 4వ రోజు 25 లక్షలు, 5వ రోజు 15 లక్షలు, 6వ రోజు 5 లక్షలు, 7వ రోజు 5 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా హిందీలో కేవలం 1.2 కోట్లు మాత్రమే రాబట్టింది.
డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు వెర్షన్ 13.5 కోట్లు, హిందీ వెర్షన్ 1.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌తో కలుపుకొని ఈ చిత్రం మొత్తంగా 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 54 కోట్ల రూపాయల షేర్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ చిత్రం దాదాపు 40 కోట్ల రూపాయల నష్టంతో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











