Double Ismart Collections: రామ్ పోతినేని మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. డబుల్ ఇస్మార్ట్‌కు ఎన్ని కోట్లంటే?
తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మాతలుగా ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్ నటించిన ఈ చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ఎంత బడ్జెట్‌తో రూపొందించారు? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేనితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, ఆలీ తదితరులు నటించారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్లు (6 కోట్ల రిటర్న్) రూపాయల మేర జరిగింది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు విషయానికి వస్తే.. ఆంధ్ర, నైజాంలో 43 కోట్ల మేర, ఓవర్సీస్ 5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 54 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 55 కోట్లుగా నిర్ణయించారు.
టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రభావంతో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో భారీ ఓపెన్సింగ్స్ నమోదు అయ్యాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 45 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో పెద్దగా ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది.

ఇక తొలి రోజు డబుల్ ఇస్మార్ట్ చిత్రం రామ్ కెరీర్‌లో ఉత్తమ బాక్సాఫీస్ ప్రదర్శన చేసింది. తెలుగులో ఈ చిత్రం 6.10 కోట్లు నికరంగా, కర్ణాటకలో 65 లక్షలు నికరంగా, హిందీలో 50 లక్షలు నికరంగా 1 కోటి రూపాయలు, గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.49 కోట్లు, సీడెడ్‌లో 90 లక్షలు, ఉత్తరాంధ్రలో 76 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 44 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 లక్షలు, నెల్లూరులో 20 లక్షలతో ఈ చిత్రం 6.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 65 లక్షలు, ఓవర్సీస్‌లో 55 లక్షలు కలిపి మొత్తంగా 7.30 కోట్ల షేర్, 12.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇక డబుల్ ఇస్మార్ట్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 2.25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆంధ్రాలో 1.75 కోట్లు, తమిళ, కన్నడ, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం 50 లక్షల నికరంగా వసూళ్లను సాధించింది. తొలి రోజుతో పోల్చుకొంటే ఈ చిత్ర కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం రెండు రోజుల్లో 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 54 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది మరో నాలుగు రోజులు ఆగితే తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











