Double Ismart 2 days Collections: భారీగా పడిపోయిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ ప్రాంచైజీ డబుల్ ఇస్మార్ట్ మిక్స్‌డ్ రెస్సాన్స్‌తో థియేట్రికల్ జర్నీని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను చేరుకోలేకపోయింది. దాంతో ఈ రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు పెద్దగా నమోదు కాలేదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊగిసలాటను కొనసాగిస్తున్నది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో అలీ కామెడీపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రామ్, సంజయ్ దత్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ.. ఆలీతో పూరీ చేయించిన వల్గర్ కామెడీని ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారు. దాంతో ఈ చిత్రంలోని ఆ సన్నివేశాలను తొలగించే పనిలో యూనిట్ ఉన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ ఇస్మార్ బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Double Ismart Day 2 Box Office Collections Worldwide Ram pothineni s movie dropped heavily at GBOC

రామ్ పోతీనేని సినిమా తొలి రోజు భారీగా వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు నికరంగా, కర్ణాటలో 65 లక్షల నికరంగా, తమిళంలో 15 లక్షలు, కేరళలో 10 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షల వసూళ్లను సాధించింది. దాంతో ఇండియాలో ఈ మూవీ 8.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

రెండో రోజు ఈ సినిమా థియేట్రికల్‌గా ఆక్యుపెన్సీ విషయంలో భారీగా డ్రాప్ అయింది. ఈ చిత్రం సుమారుగా 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కాకినాడ, వరంగల్, వైజాగ్, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకు రెస్పాన్స్ ఫర్వాలేదనిపించేలా నమోదైంది.

Double Ismart Day 2 Box Office Collections Worldwide Ram pothineni s movie dropped heavily at GBOC

ఇక డబుల్ ఇస్మార్ట్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 2.25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆంధ్రాలో 1.75 కోట్లు, తమిళ, కన్నడ, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం 50 లక్షల నికరంగా వసూళ్లను సాధించింది. తొలి రోజుతో పోల్చుకొంటే ఈ చిత్ర కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఓవర్సీస్‌ కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం రెండు రోజుల్లో 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 54 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది మరో నాలుగు రోజులు ఆగితే తెలియడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X