Double Ismart 2 days Collections: డిజాస్టర్ దిశగా డబుల్ ఇస్మార్ట్.. లాభాల్లోకి రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే?

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు డబుల్ ఇస్మార్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరీ కనెక్ట్ బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. అయితే కటెంట్ విషయంలో ఫెయిల్ కావడంతో ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులేస్తున్నది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ మూవీని భారీగా, ఖ ర్చుకు వెనుకడాకుండా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, ఆలీ, షియాజీ షిండే లాంటి నటుల రెమ్యునరేషన్లు, మణిశర్మ, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి ఈ సినిమాను 90 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

Double Ismart Day 4 Box Office Collections Worldwide Ram pothineni s movie dropped heavily at GBOC

డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీ బజ్ ఉండటంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి 54 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ రైట్స్ కొనుగులు చేశారు. దాంతో ఈ సినిమా 54 బ్రేక్ ఈవెన్ కనీసం కోట్లుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

ఇస్మార్ట్ శంకర్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌కు, ప్రేక్షకుల అంచనాలకు తగినట్టే ఈ సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఏకంగా ఇండియాలో 7.5 కోట్లు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే సినిమా టాక్ ప్రతికూలంగా మారడంతో రెండో రోజు నుంచి దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి.

పూరీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో రోజు ఇండియాలో 1.5 కోట్ల నికరంగా, 2.25 కోట్లు గ్రాస్ వసూళ్లను సాదించింది. ఇక మూడో రోజు ఈ చిత్రం 1.5 కోట్లు ఇండియాలో, వైరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 10 కోట్లకుపైగా నికరంగా, 15 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Double Ismart Day 4 Box Office Collections Worldwide Ram pothineni s movie dropped heavily at GBOC

ఆదివారం రోజున కలెక్షన్లు పెరుగుతాయని భావించినప్పటికీ.. సినిమా వసూళ్లు దారుణంగా నమోదు అయ్యాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద 1 కోటి రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2 కోట్లు వసూలు చేసింది. దాంతోఈ సినిమా 4 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం 54 కోట్ల షేర్ టార్గెట్‌గా కలెక్షన్ల యాత్రను మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల మేర నష్టాలకు గురి కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X