Dragon Closing Collections: డ్రాగన్ క్లోజింగ్ కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ నిర్మించగా, దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించిన చిత్రం డ్రాగన్. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్‌తో రిలీజైన ఈ సినిమాలో యువ హీరో, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్, ప్రత్యేక పాత్రలో ఇవానా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన విడుదలై రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు వసూళ్లు సాధించింది? బ్రేక్ ఈవెన్ ఎంత? ప్రాఫిట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
డ్రాగన్ చిత్రంలో ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి 40 కోట్ల రూపాయల బడ్జెట్‌గా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

డ్రాగన్ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లోను రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తమిళనాడులో 81 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఏపీ, నైజాంలో 22 కోట్ల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది అని ఆన్‌లైన్ కలెక్షన్స్ వెబ్ సైట్ సాక్ నిల్క్ వెల్లడించింది.
తెలుగులో రిటర్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు, తమిళ, కన్నడ వాసులను ఆకట్టుకొన్నది. దాంతో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 35 కోట్త రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 151 కోట్ల రూపాయల గ్రాస్, 115 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.
డ్రాగన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సుమారుగా 31 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలకు పైగా లాభాలను పంచి పెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో రెండో భారీ హిట్ నమోదైంది అని డిస్టిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











