Dragon Day 1 Collections: సెన్సేషనల్‌గా డ్రాగన్ కలెక్షన్లు.. లవ్ టుడే హీరో మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ నిర్మించగా, దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించిన చిత్రం డ్రాగన్. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్‌తో రిలీజైన ఈ సినిమాలో యువ హీరో, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్, ప్రత్యేక పాత్రలో ఇవానా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డ్రాగన్ చిత్రంలో ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి 40 కోట్ల రూపాయల బడ్జెట్‌గా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Dragon Day 1 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s Movie Excellent Start at GBOC

తమిళం, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు సూపర్ రెస్పాన్స్ రావడం, హీరో ప్రదీప్ నటించిన ఇంతకు ముందు సినిమా లవ్ టుడే భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను గ్రాండ్‌గా సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.

ఎడ్యుకేషన్, కెరీర్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి అంశాల ఆధారంగా చేసుకొని సామాజిక సందేశంతో రూపొందించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌తోపాటు కరెంట్ బుకింగ్‌కు కూడా సానుకూలమైన స్పందన లభించింది. తమిళనాడులో ఈ చిత్రానికి మార్నింగ్ షోకు 35 శాతం, మ్యాట్నికి 50, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగులో మాత్రం సుమారుగా 35 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది.

Dragon Day 1 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s Movie Excellent Start at GBOC

డ్రాగన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ రెస్పాన్స్ కనిపించింది. తమిళంలో ఈ సినిమాకు సుమారుగా 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 40 లక్షలు, కన్నడలో 1 కోటి రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తొలి రోజు ఈ సినిమా సుమారుగా ఇండియాలో 4.10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 1.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా తొలి రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.

డ్రాగన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద సుమారుగా 35 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా వారాంతానికి భారీగా ఆక్యుపెన్సీని పెంచుకొనే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా తొలి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X