Dragon Day 2 Collections: డ్రాగన్ కలెక్షన్ల సంచలనం.. ప్రదీప్ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. ఎన్ని కోట్లంటే?
కోలివుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ నిర్మించగా, దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించిన చిత్రం డ్రాగన్ (Dragon). తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of the Dragon) టైటిల్‌తో రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డ్రాగన్ చిత్రంలో యువ హీరో, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్, ప్రత్యేక పాత్రలో ఇవానా నటించారు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి 40 కోట్ల రూపాయల బడ్జెట్‌గా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

తమిళం, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు సూపర్ రెస్పాన్స్ రావడం, హీరో ప్రదీప్ నటించిన ఇంతకు ముందు సినిమా లవ్ టుడే భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను గ్రాండ్‌గా సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.
డ్రాగన్ సినిమా తమిళం, తెలుగులో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మధ్యాహ్నం నుంచి కరెంట్ బుకింగ్ పెరిగింది. దాంతో తమిళనాడులో రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కర్ణాటకలో 1 కోటి రూపాయల వసూళ్లను సాధించింది. ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో సౌత్‌లో ఈ చిత్రం 7.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా మెరుగైన నంబర్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమాకు యూత్ నుంచి రెస్పాన్స్ వస్తుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు పుంజుకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

డ్రాగన్ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో డీసెంట్ జర్నీని బాక్సాఫీస్ వద్ద ప్రారంభించింది. నార్త్ అమెరికాతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్, శ్రీలంక, మలేషియా దేశాల్లో గుడ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో 540K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 4.7 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 13 కోట్లకుపైగా రూపాయలను ప్రపంచవ్యాపత్ంగా రాబట్టింది.
ఇక రెండో రోజు కూడా డ్రాగన్ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళనాడులో 7 కోట్లు, కన్నడలో 1.5 కోట్లు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో మరో 5 కోట్ల రూపాయలు రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. రెండో రోజు ఈ సినిమా 15 నుంచి 17 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 2 రోజుల్లో 30 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











