50 కోట్ల క్లబ్‌లోకి డ్రాగన్.. ప్రదీప్ మూవీ కలెక్షన్ల జోరు.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?
లవ్ టుడే సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రదీప్ రంగనాథన్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, యువ తార కాయడు లోహర్, ప్రత్యేక పాత్రలో లవ్ టుడే ఫేమ్ ఇవానా నటించిన చిత్రం డ్రాగన్ (Dragon). తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ పాయింట్ వివరాల్లోకి వెళితే..
కోలివుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ నిర్మించగా, ఈ సినిమాకు ఓరి దేవుడో ఫేమ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించారు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి 40 కోట్ల రూపాయల బడ్జెట్‌గా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

తమిళం, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు సూపర్ రెస్పాన్స్ రావడం, హీరో ప్రదీప్ నటించిన ఇంతకు ముందు సినిమా లవ్ టుడే భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను గ్రాండ్‌గా సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.
డ్రాగన్ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తమిళంలో మొదటి రోజు 5.5 కోట్లు, రెండో రోజు 9 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక మూడో రోజు ఈ సినిమా మరో 9 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో 3 రోజుల్లో 23 నుంచి 25 కోట్ల మేర కలెక్షన్లను కేవలం తమిళంలోనే వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుుగులో ఈ సినిమాకు తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే మిక్స్‌డ్ టాక్‌ను పాజిటివ్ టాక్‌గా సొంతం చేసుకొని వసూళ్లను భారీగా నమోదు చేసే పనిలో ఉంది. తొలి రోజు 1.5 కోట్లు, రెండో రోజు 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూడో రోజు ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 3 రోజుల్లో 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
గత రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో 15 కోట్ల మేర, తెలుగులో 3.45 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు, సినిమా యూనిట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 35 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమా 3వ రోజు మరో 20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 50 కోట్ల మైలురాయిని దాటే ఛాన్స్ పక్కాగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి.. భారీ లాభాల దిశగా అడుగులేస్తున్నది.


Click it and Unblock the Notifications











