Dragon Overseas Business: డ్రాగన్‌కు ఓవర్సీస్‌లో రికార్డ్ బిజినెస్.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ డ్రాగన్. వార్ 2 డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్‌కి ఎలాగైనా హిట్ అందించాలని ఎన్టీఆర్ కసిగా ఈ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్, సలార్‌లతో హిట్ అందుకున్న ప్రశాంత్.. తన విజయాలను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఓవర్సీస్‌లో డ్రాగన్ మూవీకి రికార్డ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
డ్రాగన్ రిలీజ్ ఎప్పుడు?
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణలు భారీ బడ్జెట్‌తో డ్రాగన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జోర్డాన్ షెడ్యూల్‌లో మార్పులు
తన కెరీర్‌లోనే ఎన్నడూ కనిపించని విధంగా స్టైలీష్‌గా, రగ్గడ్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ వెళ్లింది. ఇక్కడ డ్రాగన్‌లో అత్యంత కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లుగా ఫిలింనగర్ టాక్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం... జోర్డాన్ షెడ్యూల్ మార్చి 6 వరకు జరగాల్సి ఉంది. అయితే అనుకున్న దానిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిపాటి సీన్స్‌ని మాత్రమే జోర్డాన్‌లో పూర్తి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఆర్టిస్ట్‌ల సమస్య, ఇతర కారణాలతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జోర్డాన్‌లో బ్యాలెన్స్ ఉన్న ఈ సీన్స్‌ని హైదరాబాద్‌లోనే ప్రత్యేకమైన సెట్స్ వేసి పూర్తి చేయనున్నారు.
డ్రాగన్ కోసం ప్రశాంత్ డిఫరెంట్ టేకింగ్
ఇక డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ తన టేకింగ్ స్టైల్ కూడా మార్చారట. ప్రశాంత్ నీల్ అనగానే కేజీఎఫ్ సిరీస్, సలార్‌లు గుర్తొస్తాయి. హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాలలో ప్రతి సీన్ బ్లాక్ అండ్ డార్క్, గ్రే షేడ్‌లో విజువల్స్ కట్టిపడేశాయి. దాంతో ప్రశాంత్‌కు మరో స్టైల్‌లో తీయడం చేతకాదా? డ్రాగన్‌కు కూడా అదే ఫార్మాట్‌లో వెళ్తారా అనే టాక్ నడిచింది. దీనికి చెక్ పెట్టేందుకు గాను ఎన్టీఆర్ సినిమాను ఫుల్ కలర్ ఫార్మాట్‌లో పిక్చరైజేషన్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.
డ్రాగన్ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ
మరోవైపు డ్రాగన్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నారట. కానీ నిర్మాతలు మాత్రం తొందరపడకుండా వేచి చూసే ఆలోచనలో ఉన్నారని ఫిలింనగర్ టాక్. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రం క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే డ్రాగన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 140 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.
డ్రాగన్ ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ధర
తాజాగా డ్రాగన్ మూవీ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి నార్త్ అమెరికా, యూకే థియేట్రికల్ రైట్స్‌ను ఓ బడా సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తుండటంతో సినీ వర్గాలు షాక్ అయ్యాయి. ఇది ఎన్టీఆర్ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓవర్సీస్ డీల్‌గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో డ్రాగన్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 11 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 100 కోట్ల రూపాయలు), యూకేలో 1 మిలియన్ డాలర్లు (10 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అయితే ఈ టార్గెట్‌ను చేరుకోవడం అంత ఆషామాషీ కాదు.. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, పుష్ప 2 వంటి చిత్రాలు మాత్రమే నార్త్ అమెరికాలో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించాయి.


Click it and Unblock the Notifications











