Dream Girl 2 Collections స్టార్ హీరోలకు మించి అనన్య పాండే మూవీ వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్‌లో డ్రీమ్ గర్ల్ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌ హేమామాలినికి ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆమెను డ్రీమ్ గర్ల్‌గానే అభిమానులు, సినీ ప్రేక్షకులు పిలుచుకొంటారు. అలాంటి పాపులర్ టైటిల్‌తో వచ్చిన చిత్రం డ్రీమ్ గర్ల్ 2. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డ్రీమ్ గర్ల్ మూవీని ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, శోభాకపూర్ తమ సొంత బ్యానర్‌పై భారీగా, రిచ్‌గా నిర్మించారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుమారు 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ క్రేజ్ రావడం, ఆయుష్మాన్ ఖురానా నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా హై రేంజ్‌లోనే నమోదైంది.

Dream Girl 2 Day 1 Collections worldwide: Ayushmann Khurranas movie rocking start at Box office

డ్రీమ్ గర్ల్ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలుగా జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 75 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమాకు భారీ క్రేజ్ రావడంతో దాదాపు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆయుష్మాన్ కెరీర్‌లో అత్యధికంగా స్క్రీన్లలో రిలీజైన సినిమా ఇదే కావడం గమనార్హం.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 చిత్రం ఆడియెన్స్‌ను తొలి రోజు థియేటర్‌కు రప్పించలేకపోయింది. ఈ సినిమా మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్‌గా మొదలయ్యాయి. మార్నింగ్ షోకు 20 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షో కొంత బాక్సాఫీస్ నంబర్లు పుంజుకొన్నాయి. ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

Dream Girl 2 Day 1 Collections worldwide: Ayushmann Khurranas movie rocking start at Box office

ఇక డ్రీమ్ గర్ల్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆయుష్మాన్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజు ఇండియా వైడ్ దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 12 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి రోజు కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌లో 15 శాతం రెవెన్యూను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X