Drinker Sai Collections: డ్రింకర్ సాయి కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న చిన్న చిత్రం.. ఎన్ని కోట్లంటే
చిన్న చిత్రమైనా కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన చిత్రం డ్రింకర్ సాయి. రిలీజ్‌కు ముందే ప్రమోషన్స్ పరంగా ఆకట్టుకొన్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరంగా దూసుకెళ్తున్నది. నూతన నటీనటులు, నిర్మాతలు, దర్శకుల ప్రయత్నానికి కలెక్షన్లపరంగానే కాకుండా క్వాలిటీ, మేకింగ్ పరంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 2024 సంవత్సరం చివర్లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలుగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడిగా పరిచయమై రూపొందించిన చిత్రం డ్రింకర్ సాయి. యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వంతెన అనే పాత్రతో కమెడియన్ భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి కీలక పాత్రలు పోషించారు.

రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ పరంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా చుట్టు నెలకొన్న వివాదాస్పద సంఘటన మరింత బజ్ క్రియేట్ చేసింది. చిత్రం యూనిట్‌పై మంతెన సత్యనారాయణ వర్గం దాడి చేయడం ఈ సినిమాకు మరింత ప్రచారం లభించింది.
మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న డ్రింకర్ సాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన పరిస్థితిని సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా బడ్జెట్‌తో పోల్చితే భారీ వసూళ్లను నమోదు చేస్తున్నదని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

డ్రింకర్ సాయి సినిమాను రిచ్‌గా క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా నిర్మించారు. దాంతో ఈ సినిమా కోసం సుమారుగా 6 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారు. దాంతో సాంకేతికంగా హై క్వాలిటీతోపాటు నూతన నటీనటులు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారనే విషయాన్ని క్రిటిక్స్ ప్రస్తావిస్తున్నారు. దాంతో ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల ఆదరణకు కూడా నోచుకొన్నది. దాంతో ఈ సినిమా గత 5 రోజుల్లో 3.11 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓ చిన్న సినిమా భారీ సినిమాల పోటీ తట్టుకొని ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











