Don't Miss!
- News
Lady: భర్త చనిపోయాడు, లేడీకి కోరికలు పుట్టించి అక్రమ సంబంధం, ఆఫీసులో లేడీ ఆత్మహత్య, లెటర్ !
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Drishyam 2 Day 15 collections 250 కోట్లకు చేరువగా దృశ్యం 2.. బాక్సాఫీస్ వద్ద తగ్గని కలెక్షన్ల జోరు!
అజయ్ దేవగన్, శ్రీయా సరన్, టబూ తదితరులు నటించిన దృశ్యం 2 చిత్రం హిందీ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. రెండువారాల తర్వాత కూడా కలెక్షన్ల ఊపు తగ్గడం లేదు. బ్రహ్మస్త్ర, భూల్ భులయ్యా చిత్రాల తర్వాత దృశ్యం 2 చిత్రం హిందీ సినిమా పరిశ్రమకు జోష్ పెంచింది. గత 15 రోజులుగా దృశ్యం సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
దృశ్యం 2 సినిమా 14 రోజుల్లో దేశవ్యాప్తంగా మత్తం 180 కోట్లకుపైగా షేర్, 242 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలివారం 120 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండోవారం 50 శాతం క్షీణించినప్పటీకి.. నిలకడగా వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో ఈ చిత్రం 58 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో బాక్సాఫీస్‌ను దృశ్యం 2 చిత్రం కుమ్మేసింది. ఈ చిత్రం రెండోవారంలో 1.65 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో గత 14 రోజుల్లో 5.17 మిలియన్ డాలర్లు అంటే.. 42.15 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక 15వ రజోున ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 250 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది.
దృశ్యం 2 సినిమా తొలి నాలుగు రోజుల్లో 75 కోట్లు రాబట్టింది. 7వ రోజు 100 కోట్లు, 15వ రోజుకు 170 కోట్ల మేర రాబట్టింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో కలెక్షన్లను వసూలు చేసిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు సాధించింది.