Drishyam 2 Day 4 collections దుమ్మురేపుతున్న కలెక్షన్లు.. 100 కోట్లకు చేరువగా.. బాలీవుడ్‌లో అరుదైన రికార్డు
మలయాళంలో భారీ విజయాన్ని అందుకొన్న దృశ్యం 2 చిత్రానికి రీమేక్‌గా అదే టైటిల్‌తో రిలీజైన మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇటీవల కాలంలో హిందీ చిత్రాలకు ముఖం చాటేసిన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో దృశ్యం2 చిత్రం సక్సెస్ అయింది. అజయ్ దేవగణ్, శ్రీయ సరన్, అక్షయ్ ఖన్నా, ఇషితా దుత్తా, రజత్ కపూర్ నటించిన ఈ చిత్రం గత మూడు రోజులుగా భారీ కలెక్షన్లు సాధించింది.
దృశ్యం 2 చిత్రం గత మూడు రోజుల్లో 64.14 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్య 2 సాధించిన కలెక్షన్ల తర్వాత ఈ చిత్రం అత్యుత్తమ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది. తొలి రోజుతో పోల్చుకొంటే.. రెండు రోజు 40 శాతానికిపైగా, రెండో రోజుతో పోల్చుకొంటే మూడో రోజు 25 శాతం వృద్ధిని సాధించింది.

దృశ్యం 2 చిత్రం సానుకూలమైన రివ్యూలను సొంతం చేసుకొన్నది. తొలివారాంతంలో రికార్డు వసూళ్లను రాబట్టింది. శుక్రవారం 15.38 కోట్ల రూపాయలు, శనివారం 21.59 కోట్లు, ఆదివారం 27.17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 64.14 కోట్ల వసూళ్లు రాబట్టడమే కాకుండా 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.
దృశ్యం మూవీ నాలుగో రోజున కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. సోమవారం కూడా మెరుగైన అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఈ సినిమా నాలుగో రోజున 10 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బాలీవుడ్‌లో 2022 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లన్నింటిలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ ఏడాదిలో తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











