Drishyam 2 Day 6 collections 100 కోట్లకు ఇంచు దూరంలో.. 6వ రోజు ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్‌కు జోష్ కలిగించిన దృశ్యం 2 చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాల తలకిందులు చేస్తూ.. 100 కోట్లకు చేరువైంది. నవంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రతీ రోజు రూ.10 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం సెన్సేషనల్‌గా మారింది. అయితే దృశ్యం 2 సినిమా 6వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
దృశ్యం 2 సినిమా మలయాళంలో మోహన్ లాల్ నటించిన, అలాగే తెలుగులో రీమేక్ చేసిన దృశ్యం సినిమాకు రీమేక్. అయితే కోవిడ్ సమస్య కారణంగా మలయాళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజైంది. అయితే థియేట్రికల్‌గా దృశ్యం 2 రిలీజై రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్నది.

ఇక గత 5 రోజుల్లో దృశ్యం 2 సినిమా సాధించిన వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 15.38 కోట్లు, రెండో రోజు 21.59 కోట్లు, మూడో రోజు 27.12 కోట్లు, నాలుగో రోజు 11.87 కోట్లు, ఐదో రోజు 10.48 కోట్లతో ఈ చిత్రం 86 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక ఆరో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 6వ రోజు 10 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దృశ్యం 2 సినిమా 6 రోజుల కలెక్షన్లను కలిపితే.. మొత్తంగా 97 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. దాంతో తొలివారం ముగిసే సమయానికి 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం ఖాయంగా మారింది.


Click it and Unblock the Notifications











