Drishyam 2 Day 9 collections 200 కోట్లకు చేరువగా దృశ్యం2.. మోహన్‌లాల్, వెంకటేష్ ఆ మ్యాజిక్ మిస్!
అజయ్ దేవగన్, శ్రీయ సరన్ జంటగా నటించిన దృశ్యం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. అభిషేక్ పాథక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. గత ఏడాదిగా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు సాధించడంతో ట్రేడ్ వర్గాలు ఆందోళనలో పడిపోయాయి. అయితే బ్రహ్మస్త్ర తర్వాత ఆ రేంజ్ వసూళ్లను సాధించిన చిత్రంగా దృశ్యం 2 దూసుకుపోతున్నది. అయితే ఈ సినిమా 9వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

మోహన్‌లాల్, వెంకటేష్ ఓటీటీలో రావడంతో
జీతూ జోసెఫ్ కథా, దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన దృశ్యం 2 చిత్రం కోవిడ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్ కాలేకపోయింది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 తెలుగు రీమేక్ సినిమా పరిస్థితి కూడా అంతే. దాంతో వారిద్దరూ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ను చూడలేకపోయారు. కానీ అజయ్ దేవగన్ మాత్రం ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేసి బాలీవుడ్‌కు జోష్ తెప్పిస్తున్నారు.

9వ రోజు దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ
దృశ్యం 2 సినిమా రెండోవారంతంలో అంటే 9వ రోజున కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఆహ్మాదాబాద్, చంఢీగడ్, జైపూర్, ఇతర నగరాల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ప్రధాన నగరాల్లో 45 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

తొలివారం తర్వాత అదే జోష్
దృశ్యం 2 తొలివారం దేశవ్యాప్తంగా 104 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. రెండోవారంలో శుక్రవారం 7.87 కోట్లు, తొమ్మిదో రోజు 15 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ చిత్రం ఇండియావైడ్ 127 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో కుమ్మేసిన అజయ్ దేవగన్
దృశ్యం 2 సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. గత 9 రోజుల్లో 3.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 28.63 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అమెరికా, కెనడాలో 1,610,000 డాలర్లు, యూఏఈ, జీసీసీ 902,000 డాలర్లు, యూకే, ఐర్లాండ్‌లో 266,000, ఆస్ట్రేలియాలో 424,000 డాలర్లు, ఇతర దేశాల్లో 304,000 డాలర్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా దృశ్యం 2 కలెక్షన్లు
ఇక ప్రపంచవ్యాప్తంగా దృశ్యం 2 కలెక్షన్ల విషయంలోకి వస్తే.. గత 9 రోజుల్లో 180 కోట్ల గ్రాస్‌తో 200 కోట్ల క్లబ్‌లోకి చేరువైంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 127 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి మొత్తంగా 180.83 కోట్ల రూపాయలను సాధించింది. అయితే తొలి రోజు సాధించిన వసూళ్లను కూడా 9వ రోజు కూడా సాధించడం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినా తెలియజెప్పింది.


Click it and Unblock the Notifications











