Drishyam 3 13 Days Collections: 250 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3.. ఓవర్సీస్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దృశ్యం 3 సినిమా మలయాళం, ఓవర్సీస్‌లో మినహాయించి ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించలేకపోయింది. ఈ మూవీ తొలివారం ఇండియా వైడ్ 82 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో ఈ చిత్రం 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు.
దృశ్యం 3 సినిమాకు సంబంధించి రాష్ట్రాల వారీగా వసూలైన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో ఈ చిత్రం 79 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో 9 కోట్ల రూపాయలు, తమిళనాడులో 8.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 13.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 115 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్‌లో దృశ్యం 3 చిత్రం దుమ్మురేపుతున్నది. స్వదేశంలో కంటే విదేశాల్లోనే భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం 110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 225 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఈ వారాంతానికి 250 కోట్ల రూపాయల మైలురాయిని దాటే ప్రయత్నం చేస్తున్నది అని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమా 13వ రోజున మరో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి థియేట్రికల్‌గా లాభాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నది.


Click it and Unblock the Notifications