200 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3.. మోహన్ లాల్ బాక్సాఫీస్ రేర్ ఫీట్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దృశ్యం 3 సినిమా గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 16 కోట్లు, రెండో రోజు 11 కోట్ల రూపాయలు, మూడో రోజు 14 కోట్లు, నాలుగో రోజు 14 కోట్లు, ఐదో రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 5 రోజుల్లో ఇండియాలో 63 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ సినిమా వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో 57 కోట్ల రూపాయలు, కన్నడలో 11 కోట్ల రూపాయలు, తెలుగులో 7.5 కోట్ల రూపాయలు, తమిళంలో 7 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తొలి వారాంతం తర్వాత కూడా దృశ్యం 3 సినిమాను అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 700 లోకేషన్లలో 900 స్క్రీన్లలో 3 వేలకుపైగా ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. ఈ చిత్రం కేరళ, ఓవర్సీస్‌లో మంచి రెవెన్యూను రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దృశ్యం చిత్రం 6వ రోజున కూడా మోహన్ లాల్ బాక్సాఫీస్ స్టామినాను చూపించింది. ఈ చిత్రం కేరళలో బుధవారం 5.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40 లక్ష్లల రూపాయలు, తమిళనాడులో 17 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 15 లక్షల రూపాయలు, ఢిల్లీలో 4 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 3 లక్ష్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో చిత్రం 6.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత 6 రోజుల్లో ఇండియాలో 94 కోట్ల రూపాయల నెట్, 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 96 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం 100 కోట్ల రూపాయలతో నిర్మించగా.. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్లుగా నమోదు చేసుకొన్నది అని మాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో టాక్ ప్రచారమైంది. ఇటీవల కాలంలో ఆయన నటించిన నాలుగైదు సినిమాలు 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఆయన బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications