Drishyam 3 Advance Booking: మోహన్‌లాల్ క్రేజ్.. రిలీజ్‌కు ముందే దృశ్యం 3కి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన దృశ్యం సినిమా ఎంతటి సంచలనం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయి ఘన విజయాల్ని అందుకుంది. దాంతో దృశ్యం రెండో పార్ట్ రూపొంది అది కూడా వేరు వేరు భాషల్లో రీమేక్ అయి మరోసారి హిట్ సాధించింది. తాజాగా దృశ్యం ఫ్రాంచైజీలో మూడో సినిమా తెరకెక్కింది. సమ్మర్ కానుకగా మే 21వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో దృశ్యం 3 ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ దృశ్యం 3ని నిర్మించగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోనీ పెరంబవూర్, శ్రీకాంత్ మురళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రాఫర్‌గా, వీఎస్ వినాయకన్‌ ఎడిటర్‌గా సేవలందించారు. అనిల్ జాన్సన్ సంగీత దర్శకత్వం వహించారు.

Drishyam 3 Advance Booking Collections Mohanlal Starrers Pre-Sales crosses 25 Crore Mark Worldwide

దృశ్యం 3 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి దృశ్యం 3 మూవీని దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు మలయాళ సినీ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ కావడంతో దృశ్యం 3కి భారీ బిజినెస్ జరిగింది. మోహన్‌లాల్ మూవీకి దాదాపు 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

దృశ్యం 3 ప్రీ రిలీజ్ బిజినెస్
అటు నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 30 కోట్ల రూపాయల భారీ ధరతో దృశ్యం 3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనితో పాటు ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఏషియా నెట్ సంస్థ దాదాపు 15 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దృశ్యంతో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేయాలని బ్రేక్ఈవెన్ నిర్దేశించారు.

యూఎప్ ప్రీమియర్స్‌కు భారీ రెస్పాన్స్
దృశ్యం 3 ప్రీమియర్స్‌ని పరిశీలిస్తే.. అమెరికాలో ఇప్పటి వరకు 164 సెంటర్లలో 308 షోలకు గాను 6569 టికెట్లు అమ్ముడై 1,00, 748 డాలర్లు (98 లక్షల రూపాయలు) వసూలు చేసింది. తొలి రోజున నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ పరంగా ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ కలిపి 265K డాలర్లు (2.57 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఫస్ట్ వీకెండ్‌లో 435K డాలర్లు (4.21 కోట్ల రూపాయలు) రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మలయాళ సినిమాకు ఓవర్సీస్‌లో పెద్ద మార్కెట్‌గా ఉన్న గల్ఫ్ రీజియన్‌లో మోహన్‌లాల్ మూవీకి ఇప్పటి వరకు 4.12 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దృశ్యం 3 అడ్వాన్స్ బుకింగ్
మోహన్‌లాల్ క్రేజ్‌కి తోడు దృశ్యం ఫ్రాంచైజీ ట్రాక్ రికార్డ్ కారణంగా ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో దృశ్యం 3 దుమ్మురేపుతోంది. ఇప్పటికే ప్రీ సేల్స్‌లో పేట్రియాట్ మూవీ రికార్డ్‌ను బద్ధలు కొట్టింది దృశ్యం 3. మోహన్‌లాల్ - మమ్ముట్టి నటించిన పేట్రియాట్‌ మూవీకి ప్రీ సేల్స్‌లో 3,33,000 టికెట్లు సేల్ అవ్వగా.. దృశ్యం 3కి ఇప్పటికే 3,34,000 టికెట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బుకింగ్స్ ఒపెన్ అయినప్పటి నుంచి ప్రతి 24 గంటలకు 30 వేల టికెట్లు చొప్పున ఈ సినిమాకు బుక్ అవుతూ వచ్చింది.

భారత్‌లో రాష్ట్రాల వారీగా అడ్వాన్స్ సేల్స్‌ కలెక్షన్స్ పరిశీలిస్తే కేరళలో 6.12 కోట్ల రూపాయలు, తమిళనాడులో 70 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 41.50 లక్షల రూపాయలు, హర్యానాలో 15.71 లక్షల రూపాయలు రాబట్టింది. మొత్తంగా తొలిరోజున ఇప్పటి వరకు దృశ్యం 3 ప్రీ సేల్స్‌లో 26.50 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ట్రెండ్స్‌ను తొలి రోజున దృశ్యం 3 వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X