Drishyam 3 Closing Collections: దృశ్యం 3 క్లోజింగ్ కలెక్షన్స్.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా తాజాగా తెరకెక్కిన మూవీ దృశ్యం 3. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ దృశ్యం 3ని నిర్మించారు. అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోనీ పెరంబవూర్, శ్రీకాంత్ మురళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రాఫర్‌గా, వీఎస్ వినాయకన్‌ ఎడిటర్‌గా సేవలందించారు. అనిల్ జాన్సన్ సంగీత దర్శకత్వం వహించారు. మే 21న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో దృశ్యం 3 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? దృశ్యం 3 క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు? మోహన్‌లాల్ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాలు పరిశీలిస్తే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి దృశ్యం 3 మూవీని దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు మలయాళ సినీ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ కావడంతో దృశ్యం 3కి భారీ బిజినెస్ జరిగింది. మోహన్‌లాల్ మూవీకి దాదాపు 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Drishyam 3 Box Office Closing Collections Worldwide How much loss or profit for Mohanlal s Movie

దృశ్యం 3 కలెక్షన్స్
మోహన్‌లాల్ మూవీ ఇండియాలో తొలిరోజున 18.37 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. తొలి వారం 82 కోట్ల రూపాయలు, రెండో వారంలో 20.68 కోట్ల రూపాయలు, మూడో వారం 5.35 కోట్ల రూపాయలు చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేనాటికి ఇండియాలో 110 కోట్ల రూపాయల నెట్.. 125.55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు కేరళలో 89 కోట్ల రూపాయాలు, కర్ణాటకలో 14 కోట్ల రూపాయలు, తమిళనాడులో 9 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 9.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 6.36 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది దృశ్యం 3.

దృశ్యం 3 ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో తన సత్తా ఏంటో దృశ్యం 3 ద్వారా మరోసారి నిరూపించుకున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, యూరప్, యూకేలలో కలిపి ఇప్పటి వరకు దృశ్యం మూవీకి 112 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తద్వారా ఓవర్సీస్‌లో ఈ ఏడాది 10 మిలియన్ డాలర్ల మార్క్ కొట్టిన తొలి దక్షిణాది మూవీగా నిలిచింది దృశ్యం 3. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 237 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దృశ్యం 3కి లాభమెంత? నష్టమెంత?
దృశ్యం 3ని బడ్జెట్ పరంగా 100 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా.. రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని 85 కోట్ల రూపాయలకు కు దక్కించుకుంది. ఇక్కడే పెట్టిన పెట్టుబడి నిర్మాతలకు తిరిగొచ్చేసింది. అలాగే ఈ సినిమా మలయాళ వెర్షన్ శాటిలైట్ రైట్స్‌ని ఏషియా నెట్ సంస్థ 15 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. తద్వారా రిలీజ్‌కు ముందే దృశ్యం 3 బడ్జెట్ పరంగా సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ముగిసేనాటికి దాదాపు 237 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ని రాబట్టి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది దృశ్యం 3. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర ఖర్చులు పోను ట్రేడ్ వర్గాల అంచనాను బట్టి దృశ్యం 3 దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇతర భాషల్లో దృశ్యం 3 శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరిన్ని లాభాలు వస్తాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X