Drishyam 3 Day 1 Box Office: 66 దేశాల్లో దృశ్యం 3 రికార్డు ఓపెనింగ్స్.. మోహన్ లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వ్యక్తమైంది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లలో రిలీజ్‌కు ముందే 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. గల్ఫ్ కంట్రీస్‌లో 500K డాలర్లు నమోదు చేసుకొన్నది. ఇప్పటికే బుక్ మై షో యాప్‌లో 4 లక్షల టికెట్లు సుమారుగా అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తాజా అంచనాల ప్రకారం.. మోహన్ లాల్ సినిమా కేరళ, ఇతర రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇప్పటికే కేరళలో ఇతర ప్రాంతాల్లో 10 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 25 కోట్లకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది అని ట్రెడ్ అనలిస్టులు తెలిపారు.
దృశ్యం 3 సినిమాకు ఉన్న క్రేజ్, డిమాండ్ కారణంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను 66 దేశాల్లో 2700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రేజ్ బట్టి చూస్తే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించవచ్చు. ఈ సినిమా కనుక హిట్ టాక్ సొంతం చేసుకొన్నట్లయితే ఈ రేంజ్ మరింత పెరిగి.. 50 కోట్ల నుంచి 55 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications